Advertisement
Google Ads BL

దేవిశ్రీ.. ‘పుష్ప’ కోసం కుమ్మేశాడంట!


పుష్ప సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని.. ఆఖరుకి ట్రైలర్ షూట్ కూడా పూర్తి చేసుకుని.. ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకునేలోగా కరోనా వచ్చేసింది. దెబ్బకి సినిమా ఇండస్ట్రీ మొత్తం సైలెంట్‌గా మారింది. అయితే పుష్ప సినిమా షూటింగ్ ఆగినా.. మ్యూజిక్ సిట్టింగ్స్ మాత్రం యధావిధిగా సాగడం, దేవిశ్రీ ప్రసాద్ పుష్పకి పాన్ ఇండియా రేంజ్ మ్యూజిక్‌ని పూర్తి చెయ్యడం జరిగింది అనే టాక్ వినిపిస్తుంది. మొన్నటివరకు ఐటెం సాంగ్ కంపొజిషన్ జరిగింది అంటే.. కాదు మొత్తం మ్యూజిక్ పూర్తయ్యింది అని అంటున్నారు. కరోనా టైం ని దేవిశ్రీ జాగ్రత్తగా పుష్ప కోసం వాడాడు అంటున్నారు.

Advertisement
CJ Advs

అసలే అల్లు అర్జున్‌కి థమన్ మీదే కన్ను ఉంది. కానీ సుకుమార్ దేవి మీద నమ్మకంతో బన్నిని ఒప్పించాడు. కాబట్టి దేవిశ్రీ కూడా బన్నీకి మెచ్చే మ్యూజిక్ ఇవ్వాలి. సో చాలా కష్టపడి పుష్ప కోసం అదిరిపోయే ట్యూన్స్ ని సిద్ధం చేసాడట. అల వైకుంఠపురములో మ్యూజిక్ ఇప్పటికి రికార్డులని కొల్లగొడుతుండడంతో.. ఇప్పుడు దేవిశ్రీ మీద ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ దేవిశ్రీ రంగస్థలం తర్వాత డల్ అయ్యాడు. కానీ ఇప్పుడు పుష్ప మ్యూజిక్ మాత్రం ఓ రేంజ్‌లో ఉండబోతుందట. దేవి ఈ సారి సాంగ్స్‌తో అదరగొట్టేశాడట. మరి దేవి కరోనా టైం లో పుష్ప ఆల్బమ్ లోని సాంగ్స్ మొత్తాన్ని పూర్తి చేశాడని... పుష్ప లోని సాంగ్స్ అన్నీ ఆల్ టైం హిట్స్ గా నిలిచిపోయేలా ఉన్నాయని ఫిల్మ్‌నగర్ టాక్.

DSP completes Music part for Pushpa Movie:

Pushpa Movie Music Composition Finished 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs