హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినపుడు స్టార్ హీరోయిన్ అవ్వాలని అందరికీ ఉంటుంది. స్టార్ వాల్యూ సినిమాకి ఉపయోగపడడంతో పాటు రెమ్యునరేషన్ ఎక్కువగా వస్తుంది. అందువల్ల ప్రతీ హీరోయిన్ స్టార్ స్టేటస్ కోసమే కష్టపడుతుంది. ఐతే ఆ స్టేటస్ అందరికీ రాదు. ఎంత టాలెంట్ ఉన్నా ఆ స్టేటస్ కొందరికే వస్తుంది. టాలెండి ఉండి కూడా స్టార్ వాల్యూకి దూరంలో ఉన్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.
అలాంటి వారిలో నివేథా థామస్ ఒకరు. నాని జెంటిల్ మేన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఎన్టీఆర్ సరసన సినిమా చేసింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఐతే తాజాగా నివేథా నటించిన వి చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవనుంది. అందులో భాగంగా నివేథా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.
వి సినిమాలో అపూర్వ అనే పాత్రలో క్రైమ్ నవలా రచయితగా కనిపిస్తుందట. ఆ పాత్ర చాలా డేరింగ్ గా ఉంటుందని చెప్పింది. ఇంకా ఓటీటీ కోసం పనిచేయడం తనకెలాంటి అభ్యంతరం లేదని, పాత్ర నచ్చితే ఓటీటీ అయినా, థియేటర్ అయినా తనకి ఓకే అని, స్టార్ స్టేటస్ కోసం తాను వేచి చూడట్లేదని, పాత్రలు బాగుంటే అంతే చాలని తెలిపింది.