Advertisement
Google Ads BL

‘రాధేశ్యామ్’.. రెడీ అవుతున్నాడు..!


కరోనాతో షూటింగ్స్ మొత్తం ఐదునెలలుగా ఆగిపోయాయి. మార్చి 20న ఆగిన షూటింగ్స్ ఇంకా మొదలు కాలేదు. ఎవరు మొదలు పెడతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. బడా ప్రాజెక్ట్స్ దర్శకులు, హీరోలు షూటింగ్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొంతమంది కరోనాని లైట్ తీసుకుంటుంటే.. కొంతమంది లెక్కచేయడం లేదు. అలా బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండిల్ వుడ్ మొత్తం షూటింగ్స్ చెయ్యడానికి సమాయత్తమవడమే కాదు.. అందరూ సెట్స్ లోనే కనబడుతున్నారు. కానీ ఒక్క టాలీవుడ్ హీరోలే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మొన్నటికి మొన్న రామ్ చరణ్ షూటింగ్ కోసం బయలుదేరుతున్నాడన్నారు కానీ.. క్లారిటీ లేదు.

Advertisement
CJ Advs

తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్‌కి ప్రిపేర్ అవుతున్నాడట. విదేశాల్లో చెయ్యాల్సిన షూటింగ్ కాస్తా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి మారిన నేపథ్యంలో రాధేశ్యామ్ కోసం వేసిన హాస్పిటల్ సెట్‌లో ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్‌ని తిరిగి ప్రారంభించబోతున్నారట. ఈ హాస్పిటల్ సెట్‌‌లోనే ప్రభాస్‌పై కొన్ని కీలక యాక్షన్ సీన్స్‌ను షూట్ చేస్తారని.. అలాగే ఈ హాస్పిటల్ సీన్స్‌లో ప్రభాస్ పాత్ర వెరీ ఎమోషనల్‌గా ఉంటుందని తెలుస్తోంది. కరోనా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ నిబంధనల మేరకు షూటింగ్ చెయ్యడానికి రాధాకృష్ణ అన్ని ప్లానింగ్స్ చేసుకున్నాడట. వచ్చేనెల 20 నుండి ఫిలిం సిటీలో రాధేశ్యామ్ షూటింగ్ షెడ్యూల్ మొదలుపెడతారని టాక్.

Prabhas Ready to RadheShyam Movie Shooting:

RadheShyam Movie Shooting Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs