Advertisement
Google Ads BL

ట్విట్టర్‌లో అందుకే లేనంటున్న అనుష్క!


స్టార్ హీరోయిన్ అనుష్క సినిమాలతో బిజీగా ఉంటుంది కానీ.. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్‌గా ఉండదు. కేవలం ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అనుష్కకి సోషల్ మీడియా ఖాతాలున్నాయి కానీ.. ట్విట్టర్‌లో అనుష్క ఖాతా తెరవలేదు. అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాతో నిశ్శబ్దంగానే ఎదురు చూస్తుంది. కారణం సినిమా థియేటర్స్ తెరిచాకే తమ సినిమాని విడుదల చేసే యోచనలో గత ఐదునెలలుగా నిశ్శబ్దం టీం ఉంది. మీడియం రేంజ్ హీరోలు ఒక్కొక్కరిగా ఓటిటీల వైపు అడుగులు వేస్తున్నా.. అనుష్క నిశ్శబ్దం మాత్రం ఓటిటి వైపు చూడడం లేదు. అదలా ఉంటే అనుష్క ట్విట్టర్ ఖాతా తెరవకపోవడానికి కారణం ఆమె బిజీ షెడ్యూల్స్ వలనే అంట. అలాగే తనకి కాస్త సిగ్గెక్కువ అని.. సినిమా సెట్స్ లోకి వెళితే అన్ని మరిచిపోతానంటుంది అనుష్క.

Advertisement
CJ Advs

 

కొత్తవాళ్లతో తొందరగా కలవలేను అని.. సినిమా షూటింగ్స్ లేకపోతె ఇల్లే తన ప్రపంచం అని చెబుతుంది. ఇక సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి ప్రత్యేకించి కారణాలేమీ లేవని.. బిజీ షెడ్యూల్స్ వల్లనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండలేకపోతున్నట్లుగా చెబుతుంది అనుష్క. అభిమానులు ట్విట్టర్‌లోకి రమ్మని అడుగుతున్నారని.. కానీ ట్విట్టర్ లోకి అడుగు పెట్టకపోవడానికి సమయం లేకపోవడమే అంటుంది అనుష్క. అయితే ట్విట్టర్‌లోకి అడుగు పెట్టేముందు దాని గురించి అవగాహన పెంచుకోవాలని.. అయితే ఏదైనా చెప్పాలని నా మనసుకు అనిపించినప్పుడు తప్పకుండా ట్విట్టర్ లోకి చేరుతా అని చెబుతుంది అనుష్క. దీనితో.. పెళ్లి గురించి చెప్పడానికి అనుష్క ట్విట్టర్ అకౌంట్ తెరుస్తుందేమో అంటూ కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి వయసు దాటిపోయినా పెళ్లి అనే పేరెత్తకుండా సినిమాలు చేస్తున్న అనుష్క పెళ్లి కుదిరాక ట్విట్టర్ ఎంట్రీ ఇస్తుందేమో చూద్దాం.

That’s why i am not in twitter Says Anushka:

This is the reason for No Account to Anushka in Twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs