మజిలీ, వెంకీ మామా చిత్రాల తర్వాత నాగ చైతన్య చేస్తున్న చిత్రం.. లవ్ స్టోరీ. సాయి పల్లవి హీరోయిన్ గా కనిపిస్తుంది. ఫిదా సినిమాతో ప్రేక్షకులని ఫిదా చేసిన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. సున్నితమైన ప్రేమ కథల్ని హృద్యంగా తెరకెక్కించే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ చిత్రంతో మరోసారి మాయ చేయబోతున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ గ్రామీణ ప్రాంత యువకుడిగా కనిపించనున్నాడు.
అందుకోసం తెలంగాణ గ్రామీణ మాండలికాన్ని నేర్చుకున్నాడట. చైతన్య కెరీర్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ చూడబోతున్నామని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకి మంచి స్పందన వచ్చింది. ఇంకా పవన్ అందించిన పాట బాగుంది. ఐతే నేడు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున పుట్టినరోజు. ఈ విషయమై లవ్ స్టోరీ చిత్ర బృందం తమ సినిమా నుండి రొమాంటిక్ పోస్టర్ ని వదిలారు.
నాగార్జునకి బర్త్ డే విషెస్ చెప్తూ విడుదల చేసిన ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. నాగాచైతన్య, సాయి పల్లవి.. ఇద్దరూ ఒకరి పక్కన కూర్చుని ఉన్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే వారిద్దరూ డీప్ లవ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. రొమాంటిక్ కింగ్ పుట్టినరోజుని పురస్కరించుకుని రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేయడం బాగుంది. తొంభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలోనే విడుదల అవనుంది.