Advertisement
Google Ads BL

‘ఆచార్య’ టీమ్ ఫైర్.. ‘పుష్ప’ టీమ్ కామ్..!


గత రెండు రోజులుగా టాలీవుడ్‌లో రెండు బడా ప్రాజెక్టుల విషయంలో కాపీ ఆరోపణలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. కొరటాల - చిరు కాంబో మూవీ ‘ఆచార్య’, సుకుమార్ - బన్నీ కాంబో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’పై ఈ కాపీ ఆరోపణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఆచార్య టీమ్, కొరటాల శివ ఈ కాపీ ఆరోపణలు కొట్టిపారెయ్యడమే కాదు... ఈ కాపీ ఆరోపణలు చేసిన రాజేష్ పై లీగల్ యాక్షన్ కి రెడీ అవుతున్నారు. మైత్రి మూవీస్ వారికీ ఆ రచయిత కథ చెప్పినా.. అది బాగోలేదని చెప్పి మేము సినిమా తీయలేమని చెప్పేశామని, బాగోని కథతో మేము సజెషన్స్ ఎలా ఇస్తాం? అంటూ మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా సీరియస్ అయ్యారు. ప్రస్తుతము ఆచార్య కథ విషయం లీగల్ యాక్షన్ వరకు వెళ్ళింది.

Advertisement
CJ Advs

కానీ ఇక్కడ మరో కాపీ ఆరోపణ ఎదుర్కుంటున్న పుష్ప టీం మాత్రం స్పందించలేదు. సుకుమార్ ఎర్రచందనమ్ స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సినిమాని తెరకెక్కిస్తుంటే.. వెల్లంపల్లి అనే రచయిత నా తమిళ కూలి కథనే పుష్ప సినిమాగా తెరకెక్కిస్తున్నారంటూ రగడ మొదలెట్టాడు. అయితే ఈ రగడపై అటు బన్నీ కానీ, ఇటు సుక్కు కానీ స్పందించలేదు. గతంలో అజ్ఞాతవాసి అప్పుడు త్రివిక్రమ్ కూడా కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ... సైలెంట్ గానే వ్యవహారం చక్కబెట్టాడు. అలాగే అ.. ఆ విషయంలోనూ త్రివిక్రమ్ మీనా నవలని కాపీ చేసాడనే ఆరోపణలున్నాయి. అయితే తాజాగా పుష్ప ఆరోపణలపై సుక్కు స్పందిస్తాడో? లేదంటే త్రివిక్రమ్ లాగా విషయాన్ని పైకి రాకుండా చక్కబెడతాడో? చూడాలి.

Plagiarism Allegations on Acharya and Pushpa:

Acharya team Serious and Pushpa team Calm on Plagiarism Allegations 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs