Advertisement
Google Ads BL

యాంకర్ ప్రదీప్ హెచ్చరికలు జారీ చేశాడు


ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ అత్యాచారం కేసు.. సినిమా ఇండస్ట్రీని, రాజకీయ నాయకులను, మీడియా వాళ్ళని కుదిపేస్తోంది. 139 మంది ఐదువేల సార్లు తనని అత్యాచారం చేశారంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో రాష్ట్రం మొత్తం షేకయ్యింది. తనని అత్యాచారం చేసిన వారిలో పొలిటికల్ లీడర్స్, సినిమా నిర్మాతలు, యాంకర్స్, మీడియా వాళ్ళు ఉన్నారంటూ ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదులో టాలీవుడ్‌లో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పేరు ఉండడం కలకలం సృష్టించింది. గతంలో ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు మెట్లక్కడం, అలాగే సుశీంద్రన్ అనే పిచ్చోడు ప్రదీప్ పై కేసు పెట్టడం వంటి విషయాలు జరగడంతో.. ఇప్పుడు ప్రదీప్ పై ఆ యువతి చేసిన ఆరోపణలు మరోసారి హైలెట్ అయ్యాయి.

Advertisement
CJ Advs

ఆ యువతి యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వూస్ ఇస్తూ ప్రదీప్ పేరు పబ్లిక్‌గా చెప్పడం, ప్రదీప్ పేరు ఫిర్యాదులో చేర్చడంతో యాంకర్ ప్రదీప్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. దానితో బాగా హర్ట్ అయిన ప్రదీప్ నిజానిజాలు తెలుసుకోకుండా తనపై అసత్య వార్తలు రాస్తున్న వారిపై మండిపడుతున్నాడు. సోషల్ మీడియాలో, పలు యూట్యూబ్ ఛానెళ్లలో తనపై వస్తోన్న అసత్య ఆరోపణల వలన తాను మానసికంగా కృంగిపోతున్నా అని, నిజాలు తెలిసేలోపు ఈ అసత్య వార్తల వల్ల నాకు కానీ, నా ఫ్యామిలీ కానీ ఏమన్నా జరిగితే దానికి బాద్యులెవరంటూ ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు.. దీనివెనుక ఎవరున్నారో వాళ్ళందరిని బయటికి లాగుతానంటూ వార్నింగ్ ఇస్తున్నాడు.

అంతేకాకుండా ఇలాంటి సున్నితమైన విషయంలో తన పేరు ఎందుకుందో, అసలేం జరిగిందో ఆలోచించకుండా తన పేరుని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా వాడడంపై ప్రదీప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తనపై అసత్య వార్తలు రాస్తున్న వారిని, కామెంట్స్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ హెచ్చరిస్తున్నాడు.

Anchor Pradeep Fires on False allegations on him:

Anchor Pradeep warning to who troll in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs