Advertisement
Google Ads BL

తమిళ జెర్సీలో హీరోయిన్ గా అవకాశం ఆమెకే..


నేచురల్ స్టార్ నాని కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో జెర్సీ కూడా ఒకటి. ఈ సినిమాలో క్రికెటర్ గా కనిపించిన నాని అందరినీ ఆకట్టుకున్నాడు. తెలుగులో స్పోర్ట్ బేస్డ్ డ్రామా సినిమాలు చాలా వచ్చాయి. కానీ వాటన్నింటిలోకి జెర్సీ చాలా డిఫరెంట్. క్రికెట్ తప్ప మరో పని తెలియని ఓ యువకుడు సడెన్ గా క్రికెట్ ఆపేయాల్సి వస్తే ఎలా ఫీల్ అవుతాడు, ఆ తర్వాత తనకి ఓ కొడుకు పుట్టిన తర్వాత మళ్లీ క్రికెట్ బ్యాట్ ఎందుకు పట్టాడన్నది ఆసక్తికరంగా తెరకెక్కించారు.

Advertisement
CJ Advs

శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. తెలుగులో మంచి విజయం అందుకున్న ఈ చిత్రం హిందీలో రీమేక్ కి వెళ్ళింది. షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్నాడు. తెలుగు జెర్సీకి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఐతే తాజాగా ఈ సినిమా తమిళంలోకి వెళ్లనుంది. 

తమిళంలో విష్ణు విశాల్ హీరోగా కనిపించనున్నాడట. హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్న టైమ్ లో త్రిషని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఒక పిల్లాడికి తల్లిగా చేయడానికి త్రిష్ ఒప్పుకుందని సమాచారం. ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత కీలకమో హీరోయిన్ పాత్ర కూడా అంతే కీలకం. మరి అలాంటి పాత్రలో త్రిష ఇరగదీస్తుందనే చెప్పాలి. 

Jerser Remake in Tamil.. heroine fix..:

Jerser Remake in Tamil.. heroine fix..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs