Advertisement
Google Ads BL

అర్జున్ రెడ్డి మళ్ళీ రిలీజ్.. ఎప్పుడంటే..


అర్జున్ రెడ్డి సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ గా నిలిచిన ఈ చిత్రం వచ్చి ఇప్పటికి మూడేళ్ళు అవుతుంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి యూత్ లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దర్శకుడు సందీప్ వంగా కి ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. ఈ సినిమాతో రాహుల్ రామక్రిష్ణ వెలుగులోకి వచ్చాడు. తెలుగులో సంౘలనం సృష్టించిన ఈ చిత్రం హిందీ, తమిళంలోకి కూడా వెళ్ళింది. 

Advertisement
CJ Advs

హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ కూడా ప్రభంజనం సృష్టించింది. హిందీ రీమేక్ కి కూడా సందీప్ వంగానే దర్శకత్వం వహించాడు. ఐతే ఈ చిత్రం రిలీజై మూడేళ్లయిన సందర్భంగా ఒకానొక మీడియా ఛానెల్ తో మాట్లాడిన దర్శకుడు సందీప్ వంగా ఈ చిత్రాన్ని మళ్ళీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట.

మరో రెండేళ్ళు పూర్తయితే అర్జున్ రెడ్డి రిలీజై ఐదు సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా అర్జున్ రెడ్డి సినిమాని మరోసారి థియేట్రికల్ రిలీజ్ చేస్తారట. అంటే మరోసారి అర్జున్ రెడ్డి చిత్రాన్ని థియేటర్లో చూసే అవకాశం ఉందన్నమాట. థియేటర్లో చూడలేకపోయాం అనుకున్నవాళ్లకి మంచి అవకాశం..

Arjun Reddy theatrical release again..:

Arjun Reddy theatrical release again..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs