Advertisement
Google Ads BL

నితిన్ ‘అందాధున్’లో శ్రియ కీలక పాత్ర!?


టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిబిజీగా గడుపుతున్నాడు. ‘భీష్మ’ చిత్రం నితిన్ కెరియర్‌లో కాస్తో కూస్తో బలాన్నిచ్చిందని చెప్పుకోవచ్చు. త్వరలోనే ‘రంగ్ దే’ మూవీతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తవ్వడంతో తన నెక్స్ట్ మూవీ బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అందాధున్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement
CJ Advs

‘అందాధున్’ ఒరిజినల్ మూవీలో సీనియర్ నటీమణి టబు నటించి మెప్పించింది. ఈ సినిమాకు ఆమె పాత్రే కీలకం. అయితే ఆమె పాత్రలో ఎవర్ని తీసుకోవాలి..? టబునే తీసుకుంటే ఒరిజినాలిటి బాగుంటుంది కదా..? అని ఆలోచించినప్పటికీ వర్కవుట్ కాలేదట. ఆ సీనియర్ భామ ఏకంగా కోటి రూపాయిలు డిమాండ్ చేసిందట. వామ్మో.. కోటి రూపాయిలివ్వాలా అని వద్దనుకున్నారట. ఆ తర్వాత గోవా బ్యూటీ ఇలియానాను అడగ్గా మారుమాట చెప్పకుండా తాను ఇలాంటి పాత్ర చేయలేనని తేల్చి చెప్పేసిందట. ఇక ఫైనల్‌గా శ్రియ, ప్రియమణి, మమతామోహన్‌ దాస్ ఇలా ఇంకొందర్ని సంప్రదించారట.

ఫైనల్‌గా ఈ కీలక పాత్రలో నటించడానికి శ్రియను సంప్రదించగా ‘నేను రెడీ’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సో ఇన్నాళ్లుగా వెతికిన.. వెయిట్ చేసినప్పటికీ సరైన నటీమణే దొరికిందని చిత్రబృందం ఫీలవుతోందట. ఈ భామ అయితే సినిమాకు పూర్తి న్యాయం చేస్తుందని నితిన్ కూడా భావిస్తున్నాడట. సో మొత్తానికి చూస్తే.. శ్రియ చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తోందన్న మాట. ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ ముదరు భామ ఇప్పుడు ఇలా కీలక పాత్రల్లో నటిస్తోంది. సినిమాకు కీలక పాత్రలో టబ్ నటించి న్యాయం చేయగా.. శ్రియ ఏ మాత్రం ఆకట్టుకుంటుందో.. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

Shreya Plays Key Role in Nithin New Movie!:

Shreya Plays Key Role in Nithin New Movie!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs