Advertisement
Google Ads BL

‘ఆచార్య’లో కీ పాయింట్ ఇదేనా..?


చిరంజీవి - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ మొన్న చిరు పుట్టిన రోజు కానుకగా విడుదలయింది. ధర్మస్థలిలో చిరు మాస్ లుక్ మెగా ఫాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. చిరంజీవి బ్యాక్ మాస్ లుక్ తోనే మెగా ఫాన్స్ కి పూనకాలొచ్చేశాయి. కొరటాల శివ మరోసారి సామాజిక అంశంతోనే సినిమా తీస్తున్నాడని ఫిక్స్ అయ్యింది. అయితే ఈ సినిమా నక్సలిజం బ్యాగ్ డ్రాప్ లోను, దేవస్థానాలలో జరిగే అవినీతి బ్యాగ్ డ్రాప్ లోను తెరకెక్కుతుంది అని మొదటినుండి ప్రచారం లో ఉంది. చిరు న‌క్స‌లైట్ గా క‌నిపిస్తాడ‌ని.. ఇందులో గెస్ట్ రోల్ చెయ్యబోయే రామ్ చరణ్ కూడా నక్సలిజం నాయకుడు అంటూ ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాలో దేవాదాయ శాఖ అధికారిగా ఉండి.. ఆతర్వాత చిరు నక్సలిజం వైపు ఎలా ఆకర్షితుడయ్యాడో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ కథనం చక్కర్లు కొడుతోంది. ధ‌ర్మ‌స్థ‌లి అనే ప్రాంతంలో అక్క‌డ అణ‌గారిన ప్ర‌జ‌ల బాధ‌ల‌కు అద్దం ప‌ట్టేలా – వాతావ‌ర‌ణాన్ని సృష్టించి, అక్క‌డి ప‌రిస్థితుల‌కు ఎదురొడ్డి తిరుగుబాటు చేసే పాత్ర‌లో చిరు కనిపిస్తాడని.. మొదటినుండి న‌క్స‌లిజంపై ఎలాంటి సదాభిప్రాయం లేని హీరో.. స‌డ‌న్ గా నక్సలిజం విధానాల‌పై ఆక‌ర్షితుడై.... అటువైపు అడుగులు వేసిన సంద‌ర్భంలో వ‌చ్చే తొలి ఫైట్ ని ఫస్ట్ లుక్ లో చూపించారని.. ఇక ఆ యాక్షన్ సీన్ నుండే క‌థ మ‌లుపు తిరుగుతుంద‌ని ప్రచారం జరుగుతుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే కీలకమని.. చెబుతున్నారు. కొరటాల ఈ యాక్షన్ సీన్ నుండే చిరు లుక్ ని ఫస్ట్ లుక్ గా వదలడానికి కారణమని అంటున్నారు. 

Rumors on Acharya Movie Chiranjeevi Role:

Rumors on Acharya Movie Key Point
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs