ప్రభాస్‌తో ఆదిపురుష్ సినిమాని ప్రకటించి ఓం రౌత్ అందరికి షాకివ్వలేదు కానీ.. ఓం రౌత్‌తో ప్రభాస్ సినిమా అనగానే బాలీవుడ్ హీరోలే షాకయ్యారు. తానాజీ సెట్స్ పైకి వెళ్ళకముందు నుండే ఆదిపురుష్ గురించిన ఆలోచనలు దర్శకుడు ఓం రౌత్‌లో ఉన్నాయట. ఆ విషయాన్నే ఆయనే స్వయంగా చెబుతున్నాడు. ఈ సినిమా విషయంలో చాలా పరిశోధన చేశాను అని... రఫ్‌గా ఓ డ్రాఫ్ట్ తయారు చేసుకున్నాకే నా టీమ్‌కి ఆదిపురుష్ కథ వినిపించగా.. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అంటున్నాడు ఓం రౌత్. ఈ సినిమా కథ ప్రభు రామ్ కథ అని.. ఇతిహాసగాధలో ఓ భాగం అని... చారిత్రక కోణం నుండి ఇప్పటికే దీనిపై పరిశోధనలు పూర్తి చేశామని చెబుతున్నాడు దర్శకుడు ఓం.
ఇక ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్‌ప్లే అప్‌డేట్ కూడా అయ్యిందని... కథావస్తువులో మార్పులు లేనప్పటికీ.. దాన్ని తీర్చి దిద్దే విధానం నేటి పరిస్థితులకి కొత్తగా ఉంటుంది. భారీ బడ్జెట్‌తో 3D లో రూపొందుతున్న ఈ సినిమాకి ప్రభాస్‌నే హీరోగా ఎందుకు ఎంపిక చేసారు అని దర్శకుడిని అడిగితే.. దానికి ఆయన ఏం చెప్పాడో తెలుసా?. ప్రభాస్ మాత్రమే ఈ సినిమాకి, ఈ పాత్రకి సరిపోతాడని నాకు అనిపించింది. బాహుబలిగా ప్రభాస్ ఆహార్యం, ఆయన పర్సనాలిటీ, ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆయన చూపు, నిలబడే విధానం, నడిచే తీరు అలా ఆదిపురుష్ పాత్రలో ప్రభాస్‌నే ఊహించుకున్నాను. ఒకవేళ ప్రభాస్ ఒప్పుకోకపోతే నేను అసలు ఈ ఆదిపురుష్ సినిమాని చేసే వాడినే కాదు అంటున్నాడు ఓం.
ఇక ఆదిపురుష్‌లో రాముడిని ఎలా చూపించబోతున్నారని అడగగా.. ఇప్పుడిప్పుడే మాట్లాడితే అది తొందరపాటు అవుతుంది అంటూ తప్పించుకున్నాడు. ఏం మాట్లాడినా అది ఈ టైం లో కాంట్రవర్సీ అవుతుందని ఓం కి బాగా తెలుసు. అందుకే అలా తప్పించుకున్నాడు.