Advertisement
Google Ads BL

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాధపడిన వేళ..!


హీరోయిన్స్ అయినా హీరోలయినా.. సోషల్ మీడియాలో వేరే అభిమానుల చేత ట్రోల్స్ చేయబడడం ఈ మధ్య కామన్ అయిపోయింది. తమకి నచ్చని నటులను ట్రోల్ చెయ్యడంలో నెటిజెన్స్‌కి మించిన వారు లేరు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్‌లో ఇలాంటి ట్రోలింగ్స్ చూస్తుంటాం. కానీ బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మరణం తర్వాత సినీరంగ వారసులను సుశాంత్ సింగ్ రాజపుత్ అభిమానులు తెగ ట్రోల్ చేసారు. కరణ్ జోహార్ లాంటివాళ్లు ట్రోలింగ్ కి భయపడి ఇంతవరకు బయటికి రాలేదు. అలియా భట్, సోనాక్షి, సోనమ్ కపూర్, సారా అలీ ఖాన్.. అబ్బో ఎవ్వరిని సుశాంత్ సింగ్ రాజపుత్ అభిమానులు వదల్లేదు. ఆ సెగ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కి గట్టిగా తగిలింది.

Advertisement
CJ Advs

అలియా భట్, మహేష్ భట్ లకు సడక్ 2 ట్రైలర్ తోనే డిస్ లైక్స్ సెగ చూపించిన సుశాంత్ సింగ్ అభిమానులు.. శ్రీదేవి కూతురు జాన్వీ నటించిన గుంజన్ సక్సేనా సినిమాకి ట్రోలింగ్ తో సమాధానం చెప్పారు. ఈ సినిమా ఓటిటి ద్వారా విడుదలయ్యాక సినిమాలో విషయం లేదని, రివ్యూస్ అన్ని ఫేక్ అని, జాన్వీ కపూర్ నటన బాగోలేదని, గుంజన్ సక్సేనా పాత్ర పోషించే స్టేచర్ కానీ, మెచ్యూరిటీ కానీ, స్థాయి కానీ జాన్వీలో లేవంటూ కూడా విమర్శలు గుప్పించడమే కాదు.. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్‌ని తెగ ట్రోల్ చేసారు నెటిజెన్స్. దానితో జాన్వీ కపూర్ చాలా అప్ సెట్ అయ్యిందట.

తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన జాన్వీ కపూర్... గుంజన్ సక్సేనా సినిమాపై వచ్చిన ప్రతి రివ్యూనీ, అలాగే ప్రతి ట్రోల్ నీ తాను చూశానని చెప్పింది. ఆ ట్రోలింగ్ తనని చాలా అంటే చాలా బాధ పెట్టిందని... అసలు ఈ సినిమాకు వచ్చిన క్రిటిసిజంపై తన తండ్రి బోని కపూర్ కూడా బాగా ఫీలయ్యారని చెప్పింది. మా నాన్న నా సినిమా ముందే చూశారు. నా నటన పట్ల ఆయనకు నమ్మకం వుంది. అందుకే నాపై వచ్చిన ట్రోల్ ని అయన అంతగా ఆయన పట్టించుకోలేదు.. కానీ నేనే ఈజీగా తీసుకోలేకపోయా అంటూ వాపోతుంది. 

Trolling on Sridevi daughter Jhanvi Kapoor:

Janhvi Kapoor Says Father Boney Kapoor was Hurt with trolling 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs