Advertisement
Google Ads BL

ఈ పండుగ కేవలం మెగా ఫ్యాన్స్‌కే..!


ఏదైనా పండగ వస్తుంది అంటే చాలు చిన్నసినిమాల దగ్గరనుండి భారీ బడ్జెట్ సినిమాల వరకు ఆ పండగ స్పెషల్ పోస్టర్స్ అంటూ సోషల్ మీడియాలో హంగామా చేసేవి. ప్రతి ఒక్క దర్శకనిర్మాత పండగకి తమ తమ పోస్టర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. అన్ని విజ్ఞాలకు అధిపతి వినాయకుడు కాబట్టి.. వినాయకుడికి తొలిపూజ ఉంటుంది. అందుకే అందరూ వినాయకచవితికి సినిమాల విడుదల అలాగే తమ సినిమాల పోస్టర్స్‌తో హడావిడి చేసేవారు. ఇక స్టార్ హీరోల అభిమానులకైతే వినాయకచవితి పండగ ఒక ఎత్తైతే.. తమ హీరోల లుక్స్ తో బయటికి వచ్చే పోస్టర్స్ ఒక ఎత్తు. కానీ ఈ ఏడాది వినాయకచవితి కొత్త పోస్టర్స్ హంగామా లేనే లేదు. కారణం వేరే చెప్పక్కర్లేదు. ఐదు నెలలుగా అన్ని రంగాలను పట్టి పీడిస్తున్న కరోనా.

Advertisement
CJ Advs

కరోనా వలన ఎక్కడి షూటింగ్స్ అక్కడ ఆగిపోయాయి. అందుచేత ఏ ఒక్క సినిమా నుండి పోస్టర్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. లేదంటే చవితి ముందు రోజు నుండి పోస్టర్స్ హడావిడి కనిపించేది. అయితే ఒకే ఒక్క సినిమా పోస్టర్ మాత్రం ఈ చవితి స్పెషల్‌గా రాబోతుంది. అది చిరు ‘ఆచార్య’ పోస్టర్ అండ్ మోషన్ పోస్టర్.. రెండూ మెగా ఫాన్స్‌కి స్పెషల్. చవితికి కొరటాల కూడా ఏం ప్లాన్ చెయ్యలేదు. కానీ వినాయకచవితి రోజునే చిరంజీవి బర్త్ డే కారణంగా కొరటాల శివ, చిరు ఆచార్య పోస్టర్ అండ్ మోషన్ పోస్టర్‌ని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి ఈ చవితి హీరో ఒకే ఒక్క హీరో అది చిరంజీవి. కాకపోతే బర్త్‌డే‌తో పాటుగా వినాయకచవితి కూడా చిరుకి బాగా కలిసొచ్చింది. అలాగే ఏ హీరో ఫ్యాన్స్‌కి లేని సంతోషం ఈసారి ఒక్క మెగా ఫ్యాన్స్‌కే దక్కింది. 

Vinayaka Chaturthi 2020: Mega fans Festival:

Acharya Movie First Look On vinayaka chaturthi 2020
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs