ఏదైనా సినిమా విడుదలైంది అంటే సినిమా బావుంది అంటే బావుంది అని, బాలేదు అంటే బాలేదని రివ్యూస్ రాస్తారు రివ్యూ రైటర్స్. ఒకవేళ సినిమా బావుండి ఎక్కువ రేటింగ్స్ ఇస్తే.. ఓకే. అదే గనక సినిమా బాలేదు.. అని తక్కువ రేటింగ్ ఇస్తే ఆయా సినిమా హీరోలు, దర్శకులు రివ్యూ రైటర్స్ మీద నిప్పులు చెరుగుతారు. అయితే ఎన్ని అనుకున్నా రివ్యూ రైటర్స్ తమ పని తాము చేసుకుపోతుంటారు. ఇక వెబ్ మీడియాలో రివ్యూస్‌కి ఉన్న ఇంపార్టెంట్ మరి దేనిలో లేదు. ఎక్కువమంది సినిమా విడుదలైన తర్వాత టాక్‌ని బట్టి రివ్యూస్‌ని బట్టి సినిమాలు చూస్తుంటారు.
తాజాగా థియేటర్స్ మూత బడినా ఓటిటీస్‌లో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. రివ్యూ రైటర్స్ తమ పని తాము చేస్తూనే ఉన్నారు. డిజిటిల్ మీడియాలో విడుదలైన ప్రతి ఒక్క సినిమాకి రివ్యూ అందిస్తున్నారు. అయితే తాజాగా చాలా సినిమాలు ఓటిటిలో విడుదలవుతున్నాయి. అయితే థియేటర్స్‌లో విడుదలైన సినిమాలకు కలెక్షన్స్ బట్టి హిట్టో ఫట్టో చెప్పొచ్చు. కానీ ఓటిటిలో విడుదలైన సినిమాలు హిట్ అనేది చెప్పడం కష్టం. ఎన్ని వ్యూస్ వచ్చాయో ఓటిటీస్ బయట పెట్టవు. ఒకవేళ మంచి వ్యూస్ వచ్చాయని చెబితే నెక్స్ట్ మూవీస్ బడ్జెట్ లెక్కలు మారిపోతాయి కాబట్టి చెప్పారు.
అందుకే ఓటిటిలలో విడుదలయ్యే సినిమాలు హిట్ లేదా ఫట్ అనేది చెప్పాలంటే రివ్యూస్ బట్టి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రేక్షకులకు, నిర్మాతలకు, హీరోలకి ఈ రివ్యూలే దిక్కన్నమాట. మరి తాజాగా నాని వి అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5 న ప్రేక్షలు ముందుకు రాబోతుంది అంటూ ప్రకటించారు. మరి ఈ సినిమా హిట్ అయ్యిందా... లేదా.. తెలియాలంటే రివ్యూ రైటర్ ఇచ్చే రివ్యూస్ పడాల్సిందే. వేరే దిక్కు లేదు.