Advertisement
Google Ads BL

కరోనా: ‘మేజర్’కి, ‘సర్కారు వారి పాట’కి లింకేంటి?


మహేష్ బాబు సర్కారు వారి పాటని పరశురామ్ దర్శకత్వంలో గ్రాండ్‌గా అనౌన్స్ చేయడం.. ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ వదలడం, అలాగే మహేష్ పుట్టిన రోజునాడు సర్కారు వారి పాట మోషన్ పోస్టర్‌ని రిలీజ్ చేయడం వంటివి ఫాస్ట్ ఫాస్ట్‌గా జరిగిపోయాయి. కానీ ఇంతవరకు మహేష్ బాబు - పరశురామ్‌లు సర్కారు వారి పాట సినిమాని పట్టాలెక్కించలేదు. అందరికన్నా ముందే మహేష్ కరోనా టెన్షన్‌తో ఇంటి కాంపౌండ్ దాటలేదు. కరోనా వ్యాక్సిన్ రానివ్వండి సినిమా షూటింగ్స్ చేసుకుందామంటూ మహేష్ కరోనాపై స్పందిస్తున్నాడు. సామాజిక దూరం మీ బాధ్యత, మాస్క్ కట్టుకోవడం కూడా మీ బాధ్యతే అంటున్నాడు. అయితే మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ కి వెళ్లకపోవడానికి ఓ బలమైన కారణం ఉందట.

Advertisement
CJ Advs

అది మహేష్ - నమ్రత నిర్మాతలుగా తెరకెక్కుతున్న మేజర్ సినిమా షూటింగ్ కరోనా ముందు కాస్త బ్యాలెన్స్ ఉందట. అడవి శేష్ హీరోగా మహేష్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మేజర్ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ ముగిసాక షూటింగ్ అనుమతులు వచ్చాక మిగతా బాలన్స్ ని షూట్ చెయ్యడానికి సెట్స్ మీదకెళ్ళడం... తక్కువమందితో షూటింగ్ మొదలు పెట్టడం జరిగిందట. కొంతమేర షూటింగ్ అయ్యాక యూనిట్ సభ్యులంతా కరోనా టెస్ట్ లు చేయించుకోగా.. యూనిట్ లోని సగం మందికి కరోనా పాజిటివ్ వచ్చిందట. దానితో కంగారు పడిన మహేష్ నమ్రతలు యూనిట్ మొత్తాన్ని క్వారంటైన్‌కి వెళ్ళమని మేజర్ షూటింగ్ ఆపేశారట. దీంతో కరోనా పూర్తిగా కంట్రోల్‌లోకి వచ్చేవరకు షూటింగ్ చేయవద్దని మహేష్ డిసైడ్ అయ్యాడు కాబట్టే.. సర్కారు వారి పాట షూటింగ్ మొదలు కాలేదట.

This is the Reason for Sarkaru Vaari Paata Shooting Delay:

Major Change In Mahesh Babu Sarkaru Vaari Pata
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs