Advertisement
Google Ads BL

ఆ హీరోనా ప్రభాస్ ‘ఆదిపురుష్’ విలన్..!


బాలీవుడ్‌లో తానాజీ దర్శకుడు ఓంరౌత్.. టీ సీరీస్‌తో కలిసి టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్‌ని ‘ఆదిపురుష్’ అంటూ బాలీవుడ్‌లో ఓ సినిమాని చేయబోతోన్న విషయం తెలిసిందే. వన్ అఫ్ ద నిర్మాతగా ఓంరౌత్ ప్రభాస్ సినిమాలో భాగమయ్యాడు. ‘ఆదిపురుష్’ కథ నచ్చిన ప్రభాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. అది కాస్త పోస్టర్ రూపంలో ప్రకటన రావడం అన్ని కరోనా లాక్ డౌన్‌లోనే చకచకా జరిగిపోయాయి. ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతుంది. ప్రభాస్ రేంజ్ కి అది ఏమాత్రం ఎక్కువ కాదని నిర్మాతల నమ్మకంతోనే ఈ సినిమానికి ఇంత బడ్జెట్ పెడుతున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ప్రియాంక చోప్రా నటించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.

Advertisement
CJ Advs

ఇక ఇలాంటి సినిమాలో విలన్ పాత్రపై కూడా బోలెడంత క్యూరియాసిటీ ఉంది. బాలీవుడ్ హీరోల్లోనే ఎవరైనా విలన్ గా నటించే ఛాన్స్ ఉందని అంటుంటే.. కాదు.. ఓంరౌత్ గత చిత్రం తానాజీలో నటించిన సైఫ్ అలీ ఖాన్.. ప్రభాస్ ఆదిపురుష్ విలన్ గా నటించే అవకాశం కలదు అంటున్నారు. సైఫ్ అలీ ఖాన్, ప్రభాస్‍కి కూడా విలన్‍గా నటిస్తే బాగుంటుందని ఓం భావిస్తున్నాడట. మొత్తం ఐదు భాషల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా పక్కా హిట్ అంటూ ప్రభాస్ ఫాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ చేసారు.

Rumors on Prabhas Adipurush movie villain:

Saif Ali Khan Villain in Prabhas Bollywood film Adipurush
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs