Advertisement
Google Ads BL

శూర్పణఖ గా మంచు లక్ష్మీ ఓకే అంటోంది..


బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఆదిపురుష్ ప్రకటించినప్పటి నుండి అనేక కథనాలు బయటకి వస్తున్నాయి. భారతీయ ఇతిహాస గాథని వెండితెర మీద చూడబోతున్నామని, అదీ ప్రభాస్ ని రాముడిగా చూడబోతున్నామని ప్రచారం సాగుతోంది. అయితే రాముడిగా ప్రభాస్ ఫిక్స్ అయితే ఇతర పాత్రల్లో ఎవరెవరు నటించనున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో శూర్పణఖ పాత్ర గురించి బయటకి వచ్చింది.

Advertisement
CJ Advs

ప్రభాస్ ఆదిపురుష్ గురించి ట్విట్టర్ వేదికగా స్పందించిన మంచు లక్ష్మీ, సినిమా పట్ల చాలా ఎక్సయిటింగ్ గా ఉందని, భారతీయ ఇతిహాసాన్ని వెండితెర మీద చూసేందుకు వేచి చూస్తున్నాని పోస్ట్ పెట్టింది. ఐతే ఈ పోస్ట్ కి స్పందించిన ఆమె అభిమానులు,  ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా ప్రభాస్ కనిపిస్తే శూర్పణఖగా  మంచు లక్ష్మీ  బాగుంటుందని, ఈ విషయమై దర్శకుడు ఓం రౌత్ కి సూచిస్తామని రిప్లై ఇచ్చాడు.

దానికి మంచు లక్ష్మీ, ఓహ్.. ఖచ్చితంగా.. ఎక్కడ సంతకం పెట్టమంటారు అని శూర్పణఖ గా నటించడానికి ఓకే చెప్పింది. గతంలో అనగనగా ఓ ధీరుడు చిత్రంలో మంచులక్ష్మీ నెగెటివ్ షేడ్స్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా అందులో లక్ష్మీ నటనకి మంచి ప్రశంసలు దక్కాయి. మరి సరదాగా సాగిన ఈ సంభాషణ నిజం అవుతుందా లేదా చూడాలి.

Manchu Lakshmi Is Okay to act as Shurpanakha..:

Manchu Lakshmi Is Okay to act as Shurpanakha..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs