Advertisement
Google Ads BL

నా కడుపున ఏంజిల్ పుట్టింది అంటున్న బాబు!


ఆడపిల్లలంటే తండ్రికి ఎంతో ప్రేమ, ముద్దు. ఆడపిల్లకి కూడా తండ్రి అంతే తండ్రి మీద ఉన్న ఇష్టం తల్లి మీద కూడా చూపించరు. మెగా డాటర్ నిహారిక అంటే నాగబాబు కి ప్రాణం. నిహారిక కి ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేయడానికి రెడీ అవుతున్నాడు నాగబాబు. నిహారిక ఎంగేజ్మెంట్ లో నాగబాబు ఎంతగా ఎగ్జైట్ అయ్యాడో.. ఎంతగా ఎమోషన్ అయ్యాడో బయటికొచ్చిన వీడియోస్ లో చూసాం. తాజాగా నాగబాబు మరోసారి నిహారిక ని చూసి ఎమోషన్ అయ్యాడు. అది కూడా జీ ఛానల్ లో వినాయకచవితి రోజున ప్రసారం కానున్న బాబూ బొమ్మకు పెళ్లంట అనే కార్యక్రమాం లో నిహారిక పెళ్లి కూతురు గెటప్ లో అలరించగా.. లేటెస్ట్ గా విడుదల;ఆ చేసిన ప్రోమోలో నిహారిక చిన్ననాటి విషయం చెప్పి నాగబాబు బాగా ఎమోషన్ అయ్యాడు.

Advertisement
CJ Advs

అనసూయ దంపతులు హైలెట్ గా నిలిచిన ఈ షోలో.. ఎప్పటిలాగే చంద్ర కామెడీ స్కిట్స్, ప్రదీప్ పెళ్లి గోల, జానీ మాస్టర్, బాబా మాస్టర్స్ స్టెప్స్, నాగబాబు జేడ్జ్ గా ఈ కార్యక్రమం సాగింది. ఇక స్టేజ్ మీద ఓ తండ్రి కూతుళ్ళ సాంగ్ అయ్యాక జానీ మాస్టర్ నా కూతురు ఆరు నెలల టైం లోనే తల్లికడుపులో మరణించింది. తనకు మూడు నెలలు కడుపులో ఉన్నప్పుడే అలియా అని పేరు పెట్టుకున్నా.. చనిపోయినప్పుడు అలియా అలియా అంటూ బిగ్గరగా అరిచా అని అనగా అక్కడున్నవారు అందరు కంటతడి పెట్టుకున్నారు. ఇక నాగబాబు నేను ఓసారి న్యూజిలాండ్ వెళ్ళినపుడు నిహారిక నాలాగా ఓ కోటు వేసుకున్న వ్యక్తితో వెళ్ళిపోయి 20 నిముషాలు కనబడకపోయేసరికి న్యూజిలాండ్ లో ఉన్న వారందరిని చంపేద్దామనుకున్నాను.

అసలు వరుణ్ ని ఇండియా కి పంపేసి పద్మ నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నా.. నిహారిక లేని నేను వేస్ట్ అని అనుకున్నా. అంత పిచ్చి నా నీహా అంటే అంటూ బాగా ఎమోషనల్ అయ్యాడు నాగబాబు. ఎంతో అదృష్టం చేసుకుంటేనే వాళ్ళ కడుపున ఏంజిల్స్ పుడతారు. నేను ఎంతో అదృష్టవంతుడిని నా కడుపున నా నిహారిక ఏంజిల్ పుట్టింది అంటూ ఎమోషన్ అయ్యాడు.  మరి నిహారిక పెళ్లి చేసుకుని ఓ ఇంటికి వెళితే నాగబాబు పరిస్థితి ఏమిటో కదా.

News about Nagababu Daughter Niharika:

News about Nagababu Daughter Niharika
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs