Advertisement
Google Ads BL

‘పుష్ప’కి ప్రభాస్ హీరోయిన్‌ని వద్దంటున్నారు


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కాల్సిన పాన్ ఇండియా మూవీ పుష్ప కరోనా కారణంగా లేట్ అయ్యింది కానీ.. లేదంటే ఈసరికే ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తయిపోయేవి. కానీ కరోనా మహమ్మారి వలన బన్నీ ప్లాన్స్ అన్ని తారుమారు అయ్యాయి. అయినా బన్నీ పుష్ప లుక్‌లోనే తిరుగుతున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తుంది. ఇక మిగతా నటుల విషయంలో సుకుమార్ ఎక్కువగా బాలీవుడ్ నటులనే ఎంపిక చేసి.. వాళ్ళ పాత్రలకు కావాల్సిన ట్రైనింగ్ ఫోన్‌లోనే స్టార్ట్ చేసాడట. పాన్ ఇండియా అప్పీల్ రావాలంటే అంతా సౌత్ నటులైతే సరిపోదు.. బాలీవుడ్ నటులు కూడా అవసరమని సుకుమార్ భావిస్తున్నాడట.

Advertisement
CJ Advs

ఇక హీరోయిన్‌ని సౌత్ నుండి తీసుకున్నాం కదా.. ఐటెం గర్ల్‌ని బాలీవుడ్ నుండి తీసుకోబోతున్నారట. సుకుమార్ - మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ కాంబో ఐటెం సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. అందులోనూ దేవిశ్రీ ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్. రంగస్థలం లాంటి కథలోనే పూజా హెగ్డేతో అదిరిపోయే ఐటెం చేయించిన సుకుమార్ పుష్ప పాన్ ఇండియా మూవీకి బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్‌ని తీసుకోబోతున్నాడనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అయితే ప్రభాస్‌తో సాహోలో నటించిన శ్రద్ధా లుక్స్ పరంగాను, గ్లామర్ పరంగాను తేలిపోవడంతో.. బన్నీ సినిమాలో ఆమెతో ఐటెం సాంగ్ వద్దు అని సుకుమార్‌కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారట.

ముందు కియారాని అనుకుని మళ్లీ శ్రద్ధా కపూర్ అంటుంటే బన్నీ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట. ఐటెం కోసం బాలీవుడ్ భామే కావాలనుకుంటే ఏ కత్రినా కైఫ్ నో తీసుకురండి కానీ.. శ్రద్ధా మాత్రం వద్దంటున్నారట బన్నీ ఫ్యాన్స్. మరి సుకుమార్ ఫైనల్ గా అల్లు అర్జున్ ‘పుష్ప’ ఐటెం కోసం ఏ బాలీవుడ్ హీరోయిన్ ని దింపుతాడో చూడాలి. 

Allu Arjun Fans Request to Sukumar about Pushpa Item Girl :

Prabhas Heroine In Pushpa Item song.. Fans not happy 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs