Advertisement
Google Ads BL

మరో ఇద్దరు తెలుగు సింగర్స్‌కు కరోనా పాజిటివ్


ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అందుకే షూటింగ్స్ స్టార్ట్ చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంల చుట్టూ తిరిగిన సినిమా వారు.. ఇప్పుడు కామ్‌గా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఎందుకంటే ఇప్పటికే ఇండస్ట్రీలోని చాలా మందికి కరోనా నిర్థారణ అయింది. అందులో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి దర్శకనిర్మాతలకు, అలాగే డైరెక్టర్ తేజ, బండ్ల గణేష్ వంటి వారు.. ఈ కరోనా ప్రభావాన్ని ఫేస్ చేసినవారే. ఇక ఇప్పుడు గాన గాంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన త్వరగా.. క్షేమంగా కోలుకుని రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన మరో ఇద్దరు సింగర్స్‌కి కరోనా పాటిజివ్ నిర్థారణ అయినట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ఆ ఇద్దరు సింగర్స్ వేరే ఎవరో కాదు. సింగర్ సునీత్ మరియు మాళవిక. వీరికి కరోనా సోకడానికి కారణమైన విషయంపై కూడా టాలీవుడ్‌లో కొన్ని వార్తలు సంచరిస్తున్నాయి. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ సంగీత కార్యక్రమం కోసం వీరిరువురు షూటింగ్‌లో పాల్గొన్నారట. అయితే ఈ కార్యక్రమం కోసం షూటింగ్‌లో పాల్గొన్న వారిలోని చాలా మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని, వీరికి కూడా అక్కడే ఈ మహమ్మారి అంటుకుని ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం వీరిరువురు హోమ్ క్వారంటైన్‌లోనే ఉంటూ వైద్యుల సలహాలు పాటిస్తున్నట్లుగా సమాచారం.

2 More Telugu singers tested Corona Positive:

2 More Telugu singers Suffered with Covid 19
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs