Advertisement
Google Ads BL

కీర్తి సురేష్ మిస్ ఇండియా వచ్చేస్తోంది...


సినిమా థియేటర్లు మూతబడి ఇప్పటికి నాలుగున్నర నెలలు అవుతుంది. ఇంకా ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. కరోనా మొదలు కాకముందు రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రాలన్నీ వాటి రిలీజ్ డేట్లని వాయిదా వేసుకున్నాయి. కాలం గడుస్తూనే ఉన్నా ఎలాంటి మార్పు రాకపోవడంతో ఇక చేసేదేమీ లేక ఓటీటీ వేదికగా తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.

Advertisement
CJ Advs

తెలుగులో అమృతరామమ్ మొదలుకుని మొన్న వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వరకూ ప్రేక్షకులని ఓటీటీ ద్వారా పలకరించాయి. అయితే ఇలా ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలన్నింటిలోకి ఎక్కువ ఆసక్తి కలిగించిన చిత్రం పెంగ్విన్.  మహానటి సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్, ఓటీటీలో విడుదల అవుతుందని తెలిసినప్పుడు అంతా ఆసక్తిగా చూసారు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులని అలరించలేకపోయింది.

తాజాగా కీర్తి సురేష్ మరో చిత్రం ఓటీటీలో రిలీజ్ అవబోతుంది. మిస్ ఇండియా టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ అవనుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన రానప్పటికీ చిత్ర నిర్మాత మహేష్ కోనేరు నెట్ ఫ్లిక్స్ కి స్ట్రీమింగ్ హక్కులని అమ్మేసారని టాక్. మరి ఈ సినిమాతోనైనా కీర్తి సురేష్ కి ఓటీటీలో సరైన హిట్ పడుతుందేమో చూడాలి. నెట్ ఫ్లిక్స్ ఏ సినిమాకీ సరైన ప్రమోషన్ చేసినట్టు కనిపించలేదు. మరి కీర్తి సురేష్ మిస్ ఇండియాకి ఏ మేరకు ప్రచారం చేస్తారో..!

Keerthy Suresh Miss India will hit soon:

Keerthy Suresh Miss India will hit soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs