పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ పింక్ సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ పోషించిన పాత్రలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదే ఉంది. కరోనా రాకపోయుంటే ఈ పాటికి పవర్ స్టార్ ని వెండితెర మీద చూసుకునేవారు. అయితే వకీల్ సాబ్ ఇంకా పూర్తికాకముందే ఆ తర్వాత పవన్ చేసే చిత్రాల గురించి వార్తలు వస్తున్నాయి.
క్రిష్ దర్శకత్వంలో విరూపాక్ష, హరీష్ దర్శకత్వంలో మరో మాస్ సినిమాని అనౌన్స్ చేసిన పవన్ కళ్యాన్ ఆ తర్వాతి చిత్రాన్ని ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడనేది చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ 29వ చిత్ర విషయమై అనేక కథనాలు వస్తున్నాయి. పవన్ స్నేహితుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని అన్నారు. తాజా సమాచారం ప్రకారం పవన్ దర్శకుల లైనప్ లోకి క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా చేరాడు.
డాన్ శీను సినిమాతో రవితేజకి మంచి విజయాన్ని ఇచ్చిన గోపీచంద్ పవన్ కళ్యాణ్ 29వ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతలు ఉన్నాయట. అయితే ఈ సినిమాలన్నీ 2024లోపే పూర్తవ్వాలి కాబట్టి గోపీచంద్ మలినేనితో సినిమా ఎప్పుడు ఉంటుందో చూడాలి.