Advertisement
Google Ads BL

కరెక్ట్ టైమ్‌లో రామ్ పాలిటిక్స్‌లో వేలెట్టాడా?


తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం, ఏపీలో జగన్ సర్కార్ కోవిడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి టెస్ట్ లు చేస్తున్నారో అనే విషయం రోజు ఛానల్స్ లో ప్రసారమవుతూనే ఉంది. కానీ ఏపీలో ఓ క్వారంటైన్ సెంటర్‌లో జరిగిన ప్రమాదం మాత్రం అందరిని షాక్‌కి గురి చేసింది. పది రోజుల క్రితం ఏపీలోని విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో కరోనా పేషేంట్స్ మరణించడంతో.. ఈ ప్రమాదానికి రమేష్ హాస్పిటల్ ఎండి రమేష్‌కి సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించి పోలీసులు రమేష్ హాస్పిటల్ రమేష్‌ని అరెస్ట్ చెయ్యడానికి రెడీ అయ్యేలోపు డాక్టర్ రమేష్ ఎవరికీ కనబడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే ప్రస్తుతం ఈ కేసుని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

Advertisement
CJ Advs

తాజాగా ఈ కేసుపై హీరో రామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం అటు ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇది స్వాతంత్ర్య దినోత్సవమా లేక స్వర్ణా ప్యాలెస్ సంఘటనకు సంబంధించిన రోజా అంటూ మాట్లాడడమే కాదు... ఏపీ సీఎం జగన్‌ని అప్రతిష్టపాలు చేసే కుట్ర దాగి ఉందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ రామ్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఫైర్ సేఫ్టీ అనేది స్వర్ణ ప్యాలెస్‌కి సంబంధించినదే అని.. దానితో రమేష్ హాస్పిటల్‌కి ఏం సంబంధం అని.. అసలు స్వర్ణ ప్యాలెస్‌ని రమేష్ హాస్పిటల్ ని కోవిడ్ సెంటర్‌గా మార్చకముందు ప్రభుత్వమే.. అక్కడ కరోనా సెంటర్ నిర్వహించింది. అప్పుడు గనక అగ్నిప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించేవాళ్ళు... అంటూ రామ్ చేసిన ట్వీట్ పై ఇప్పుడు వేడి సెగలు రాజుకున్నాయి.

ఎందుకంటే రామ్.. రమేష్‌కి మేనల్లుడు. మావయ్య కావడంవల్లే రామ్.. రమేష్ హాస్పిటల్‌ని వెనకేసుకొస్తున్నాడట అంటే.. ఏపీలో జగన్ ప్రభుత్వం తీరు పలు విమర్శలకు తావిస్తున్న టైం లో రామ్ చేసిన ట్వీట్ రాజకీయ రంగు పులుముకుంటుందేమో అంటుంటే.. రామ్ ఇలాంటి టైం లో ట్వీట్ చేసి.. కరెక్ట్ టైం లో రాజకీయాలని కెలికాడా అంటున్నారు.

Hero Ram Tweet Creates Heat in AP Politics :

Hero Ram Tweet on Ramesh Hospitals about Swarna palace incident
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs