Advertisement
Google Ads BL

మహేష్‌ సినిమాకి బిజీ అని.. అక్కడ గెస్ట్ ‌రోల్ చేస్తుంది


కియారా అద్వానీ కబీర్ సింగ్ సినిమా తర్వాత బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. హాట్ అందాలతో అదరగొడుతున్న కియారా టాలీవుడ్‌లో సక్సెస్ కాలేదు కానీ... బాలీవుడ్‌లో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యింది. బాలీవుడ్‌లో ఇప్పుడు కియారా ఫుల్ బిజీగా ఉన్న తార. అందుకే తెలుగు నుండి అమ్మడుకి ఆఫర్స్ వెళుతున్నప్పటికీ.. కియారా డేట్స్ ఖాళీ లేవంటూ చెప్పేస్తుంది. సౌత్ సినిమాలకొచ్చేసరికి కియారాకి డేట్స్ ప్రాబ్లెమ్ వచ్చేస్తుంది. మహేష్ సర్కారు వారి పాట ఆఫర్ ముందు కియారాకే వచ్చినట్టుగా చెప్పారు. కానీ కియారా మాత్రం మహేష్ ఆఫర్ కే నో చెప్పినట్టుగా వార్తలొచ్చాయి.

Advertisement
CJ Advs

మరి అంత బిజీ తార ఇప్పుడు జస్ట్ గెస్ట్ రోల్‌కి ఓకె చెప్పిందట. అది కూడా ఓ వెబ్ సీరీస్‌లో గెస్ట్ రోల్ చెయ్యబోతుందట. బాలీవుడ్‌లో ఫ్యాషన్ డిజైనర్ మాసాబ్ గుప్త జీవిత కథ ఆధారంగా... మసబా మసబా వెబ్ సిరీస్ తెరకెక్కబోతుంది. ఆ వెబ్ సీరీస్‌లో కియారా అద్వాని గెస్ట్ రోల్ చేయబోతుందట. ఈ వెబ్ సీరీస్‌లో కియారా అద్వానీ సినిమా హీరోయిన్ కేరెక్టర్‌లో తళుక్కుమనబోతుందట. హీరోయిన్‌గా మాసాబ్ స్టోర్స్‌కి వెళ్లి ఓ డ్రెస్ కొనుగోలు చేసే సీన్‌లో కియారా నటించబోతుందట. అయితే ఈ వెబ్ సీరీస్ నిర్మాత అశ్విని తనని వెబ్ సీరీస్ లో గెస్ట్ రోల్ చెయ్యమని అడగగానే కియారా ఒప్పేసుకుందని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుందట.

Kiara Advani busy with Bollywood Movies:

Kiara Advani Plays Guest Role in bollywood web series
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs