Advertisement
Google Ads BL

పరశురామ్‌కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన మహేష్!


మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల తర్వాత ఐదు నెలలకు పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ సినిమాని ఓకే చేశాడు. కృష్ణ పుట్టిన రోజున సైలెంట్ గా మొదలైన ఈ సినిమా... కరోనాతో షూటింగ్ ఇంకా సెట్‌పైకి వెళ్లలేదు. అయినా పరశురామ్ పర్ఫెక్ట్‌గా మహేష్ పుట్టినరోజు నాటికి సర్కారు వారి పాట సినిమా మోషన్ పోస్టర్ ఇచ్చి మహేష్ ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చాడు. అయితే సినిమా బౌండెడ్ స్క్రిప్ట్‌తో పరశురామ్ పర్ఫెక్ట్ గా సర్కారు వారి పాట మీదే కూర్చున్నాడట. ఎలాగో థమన్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ ఉండనే ఉన్నాయి. అందుకే పరశురామ్.. మహేష్ సినిమాని ఇంకా చెక్కుతున్నాడట.

Advertisement
CJ Advs

మహేష్ బాబు కూడా పరశురామ్‌తో.. కరోనా కారణంగా మనకి చాలా టైమ్ కలిసొచ్చింది. నువ్వు ఈ లాక్‌డౌన్‌ని బాగా వాడి.. సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలని సూచించాడట. దానితో పరశురామ్ కూడా షూటింగ్ మొదలయ్యాక ప్రతీ షెడ్యూల్‌ను ఎలా చేయాలి అనేది పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే భారీ ప్లానింగ్స్ చేసిన ఈ చిత్రంతో ఎలాగైనా మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని పరశురామ్ గట్టిగా ఫిక్స్ అయ్యాడట. మహేష్ ఫ్యాన్స్ కూడా పరశురామ్ శక్తి సామర్ధ్యాలను నమ్ముతున్నారట. పరశురామ్ - మహేష్ కాంబోపై మహేష్ ఫ్యాన్స్ 100 శాతం పక్కాగా ఉన్నారట. మరి మహేష్ కూడా మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, అలాగే షూటింగ్ షెడ్యూల్ ప్లాన్స్, హీరోయిన్ డేట్స్, ముఖ్యమైన కీలక పాత్రల డేట్స్ క్లాష్ కాకుండా చూడమని కూడా పరశురామ్‌కి చెప్పాడట. పరశురామ్ అవన్నీ పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయని మహేష్‌కి భరోసా ఇచ్చాడని తెలుస్తుంది. 

Mahesh Babu Gives Full Freedom to Director Parasuram :

Mahesh Babu Fans full Happy with Parasuram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs