Advertisement
Google Ads BL

రెమ్యూనరేషన్ చూసి నాగ్ టెంప్ట్ అయ్యాడా?


కింగ్ నాగార్జున సినిమా షూటింగ్స్‌కి కరోనా అడ్డు వచ్చింది కానీ.. కరోనా టైమ్‌లోనే బుల్లితెర మీద బిగ్ బాస్ హోస్ట్ చెయ్యడానికి కరోనా అడ్డు రాలేదు. ఇప్పుడు ఈ విషయమై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. కరోనా కరోనా అంటూ సినిమా షూటింగ్స్‌కి ఎగ్గొట్టిన స్టార్ హీరోలు అందరూ గప్ చుప్‌గా ఇంట్లోనే ఉంటే నాగార్జున మాత్రం సినిమా షూటింగ్స్ పక్కన పెట్టి బిగ్ బాస్ ప్రోమో షూట్‌కి, అలాగే ప్రతి శని, ఆది వారాల ఎపిసోడ్స్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అసలైతే ఈ నెలాఖరు నుండే బిగ్ బాస్ మొదలవ్వాలి కానీ.. కొన్ని కారణాల వలన బిగ్ బాస్ సెప్టెంబర్‌కి వాయిదా పడింది.

Advertisement
CJ Advs

ఇక సీజన్ వన్ కోసం ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటే.. సీజన్ 2 కోసం నానికి మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇక సీజన్ త్రీకి కూడా నాగార్జున బాగానే రెమ్యూనరేషన్ అందుకున్నాడు. 104 రోజులు 15 ఎపిసోడ్స్ కోసం నాగార్జున సీజన్ త్రీ కి 5 కోట్ల పారితోషకం అందుకుంటే.. ఇప్పుడు సీజన్ 4 కోసం నాగ్ అదే 15 ఎపిసోడ్స్, 106  డేస్ కోసం 8 కోట్లుగా అందుకోబోతున్నాడట. నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ 4వ సీజన్ 106 రోజులు 15 ఎపిసోడ్స్‌తో ప్రారంభమైనా.. కరోనా సమయంలో షో ఎప్పుడైనా ఆగిపోవచ్చు. లేదంటే ఫుల్ ఎపిసోడ్స్ జరగవచ్చు. అందుకే నాగ్ తెలివిగా ఎపిసోడ్ కి ఇంత అని కాకుండా బిగ్ బాస్ ఎపిసోడ్స్ మొత్తానికి అంటే సీజన్ 4 మొత్తానికి కలిపి 8 కోట్లు అందుకోబోతున్నాడట.

గత సీజన్‌లో 5 కోట్లు అందుకున్న నాగ్ ఇప్పుడు 4వ సీజన్ కోసం 8 కోట్లు అంటే 3 కోట్లు ఎక్కువ అందుకోబోతున్నాడన్నమాట. అయితే సోషల్ మీడియాలో మాత్రం నాగార్జునకి భారీ పారితోషకం ఇస్తున్నారు గనకనే బిగ్ బాస్ ఒప్పుకున్నాడు. లేదంటే కరోనా టైం లో నాగ్ అంత సాహసం చేస్తాడా అంటున్నారు. మరి నిజమేనేమో నాగ్ పారితోషకాన్ని టెంప్ట్ అయ్యే బిగ్ బాస్ చేస్తున్నాడేమో.

Do you know remuneration of Nagarjuna as Bigg Boss host?:

Nagarjuna salary for Telugu Bigg Boss Season 4 revealed 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs