మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్న కీర్తి సురేష్, తన తర్వాతి చిత్రాలన్నీ నటనా ప్రాధాన్యమున్న వాటినే ఎంచుకుంటుంది. అందులో భాగంగానే పెంగ్విన్ చిత్రం వచ్చింది. అయితే ఆ చిత్రం ప్రేక్షకులని అంతగా ఆకర్షించలేదు. ప్రస్తుతం మరో వివిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. గుడ్ లక్ సఖి అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ఈరోజే విడుదలైంది.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదలైన ఈ టీజర్ లో దేశభక్తికి సంబంధించిన ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. బంజారా అమ్మాయిగా కీర్తి సురేష్ చాలా చక్కగా కనిపించింది. టీజర్ లో చూపించిన ప్రకారం కీర్తి సురేష్ పాత్రని దురదృష్టం అంటిపెట్టుకునే ఉంటుందని తెలుస్తుంది. అందువల్ల ఆ గ్రామంలోని జనాలందరూ ఆ పాత్రని బ్యాడ్ లక్ గా భావిస్తున్నట్లుగా ఉంది.
అయితే బ్యాడ్ లక్ ని అంటిపెట్టుకునే అమ్మాయి గుడ్ లక్ సఖి అనేలా ఎదిగేందుకు ఏది కృషి చేసిందనేది ఆసక్తిగా ఉంది. జగపతి బాబు కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరో ప్రాధాన్యమున్న పాత్రలో చేస్తున్నాడు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, టీజర్ తో ఆసక్తి రేపుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతుందో లేక థియేటర్లు తెరుచుకునే వరకు వెయిట్ చేస్తుందో చూడాలి.