Advertisement
Google Ads BL

సుకుమార్ నిర్మాతగా సాయి తేజ్ కొత్త చిత్రం


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ జోరు మీదున్నాడు. చిత్రలహరి సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన తర్వాత మరింత స్పీడ్ పెంచుతూ పోతున్నాడు. వరుసగా సినిమాలని లైన్లో పెడుతూ బిజీగా ఉంటున్నాడు. ప్రతీ రోజూ పండగే తో బ్లాక్ బస్టర్ అందుకున్నాక సోలో బ్రతుకే సో బెటరు తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాకముందే దేవకట్టా దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో కొత్త సినిమా ప్రకటించాడు.

Advertisement
CJ Advs


ఇప్పటి వరకు సాయి తేజ్ ప్రయత్నించని కొత్త జోనర్ లో సరికొత్త సినిమాతో వస్తున్నాడు.  మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్వీసీసీ బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కుమారి 21 ఎఫ్ సినిమాతో నిర్మాతగా మారిన సుకుమార్, నిర్మాతగా చకచకా సినిమాలని నిర్మించే పనిలో పడ్డాడు. ప్రస్తుతం సాయి తేజ్ తమ్ముడు హీరోగా పరిచయం అవుతోన్న ఉప్పెన చిత్రానికి కూడా ఒకానొక నిర్మాతగా ఉన్నాడు. ఇంకా నిఖిల్ తో చేస్తున్న 18 పేజెస్ కి భాగస్వామిగా ఉన్నాడు. ఇక ఇప్పుడు సాయి తేజ్ తో కూడా ప్రకటించేసాడు. హీరోయిన్ ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు ఎవరనేది ప్రకటించలేదు.




 

Said Dharam Tej new movie confirmed..:

Said Dharam Tej new movie confirmed..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs