Advertisement
Google Ads BL

మొత్తానికి నిహారిక నిశ్చితార్థం పూర్తయింది


మెగా ఫ్యామిలీ హీరోలంతా కరోనాకి భయపడి షూటింగ్స్ కి హాజరవడం లేదు. కేవలం మెగా హీరోలే కాదు.. ఏ హీరో కూడా షూటింగ్ స్పాట్ కి వెళ్లే ధైర్యం చెయ్యడం లేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ కరోనాకి పెద్దగా భయపడడం లేదనిపిస్తుంది. కారణం టాలీవుడ్ లోని బడా ఫ్యామిలీ పెళ్లిళ్లు కరోనా టైంలోనే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే నిఖిల్, నితిన్, రానాలు పెళ్లిళ్లు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్యలోనే అంగరంగ వైభవంగా వాళ్ళ పెళ్లిళ్లు జరిగాయి. రానా పెళ్ళిలో సమంత - చైతుల అల్లరి, దగ్గుబాటి ఫ్యామిలీ ఫోటో షూట్ అన్ని హైలెట్ అనేలా ఉన్నాయి. తాజాగా మెగా ఫ్యామిలీ పెళ్లి సందడి మొదలయ్యింది. మెగా డాటర్ నిహారిక నిశ్చితార్ధం గురువారం రాత్రి ఎలాంటి చడీ చప్పుడు లేకుండా సైలెంట్ గా జరిగిపోయింది. అసలు మీడియాకి విషయం లీక్ కాకుండా నాగబాబు కూతురు నిహారిక నిశ్చితార్దాన్ని గప్ చుప్ గా ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన కానిచ్చేశారు.

Advertisement
CJ Advs

మెగా ఫ్యామిలీ అంటే ఎంత పెద్ద ఫ్యామిలీనో చెప్పక్కర్లేదు. చిరు దంపతులు, చరణ్ దంపతులు, అల్లు ఫ్యామిలీ, కొణిదెల ఆడపడుచులు ఇలా చాలామంది ఉంటారు. నిహారిక నిశ్చితార్థంలో వాళ్ళందరూ ఉన్నారు. చిరు, సురేఖ, రామ్ చరణ్ - ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ, వరుణ్ టీజ్, సాయి ధరమ్ తేజ, శ్రీజ, సుశ్మిత, వైష్ణవ్ తేజ్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నిహారిక - చైతన్య జొన్నలగడ్డ ఎంగేజ్మెంట్ లో సందడి చేశారు. కొద్దిమంది అతిథులనే పిలిచి నాగబాబు ఇలా సైలెంట్ గా నిశ్చతార్ధం చేసినా నిహారిక ఎంగేజ్మెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలోకి లీక్ అయ్యాయి. నిహారిక మోహంలో పెళ్లికళ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంటే చిరు, నాగబాబులు చాలా హ్యాపీగా కనబడుతున్నారు. మరి కరోనాకి భయపడకుండా మెగా ఫ్యామిలీ మొత్తం మెగా డాటర్ నిశ్చితార్ధ వేడుకని గ్రాండ్‌గా కంప్లీట్ చేశారు. అయితే ఈ వేడుకకూ చిరు, నాగబాబుల సోదరుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. 

Niharika Engaged to Venkata Chaitanya Jonnalagadda:

Mega Event: Niharika and Venkata Chaitanya Engagement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs