Advertisement
Google Ads BL

పూరి - బన్నీల మధ్య సంభాషణ చూశారా?


దర్శకుడు పూరి జగన్నాధ్, విజయ్ తో తెరకెక్కిస్తున్న ఫైటర్ సినిమాని కరోనా వలన బ్రేకిచ్చి హైదరాబాద్ లోనే మకాం పెట్టాడు. ముంబై నుండి హైదరాబాద్ కి వచ్చేసిన పూరి జగన్నాధ్ అందరు దర్శకులు వలే కొత్త కథలని రాసుకుంటూ తన దగ్గరున్న జనగణమన స్క్రిప్ట్ ని బాలీవుడ్ నిర్మాతతో ఓకే చేయించుకున్నాడు. అలాగే ఓటిటి కంటెంట్ ని కూడా రెడీ చేస్తూ పూరి జగన్నాధ్ ఈ మధ్యన పాడ్ కాస్ట్ లతో అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఆ ప్రేక్షకుల్లో కొంతమంది సెలబ్రిటీస్ కూడా పూరి పాడ్ కాస్ట్ లకు అభిమానులే.

Advertisement
CJ Advs

అయితే తాజాగా పూరి జగన్నాధ్ మహిళపై చేసిన పాడ్ కాస్ట్ పై అభిమానులు తెగ స్పందిస్తున్నారు. ఆ పాడ్ కాస్ట్ అద్భుతమంటున్నారు. అలా పూరి పాడ్ కాస్ట్ ని పొగిడిన వాళ్లలో పూరితో పని చేసిన అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. పూరి జగన్నాధ్ పాడ్ కాస్ట్ లను ఫాలో అవుతున్న అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో స్పందిస్తూ పూరి గారు పాడ్ కాస్ట్స్ అద్భుతం అని, సూపర్ అని చెప్పడమే కాదు.. అవి. చాలా బావున్నాయి అని.. వ్యక్తిగతంగా నాకు మీ పాడ్ కాస్ట్ లు చాలా బాగా నచ్చాయి అని చెబుతూ పూరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పాడు. ఇంకా ఇంకా మంచి టాపిక్స్ పూరి చెయ్యాలని బన్నీ కోరుకున్నాడు. దానికి పూరి స్పందిస్తూ బన్నీ మీ ట్వీట్ చదువుతుంటే చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి క్రేజీ స్టార్ హీరో నుండి ఇలాంటి అభినందన సంతోషంగా ఉంది. దీని వలన ఈ రాత్రి మరో పెగ్ ఎక్కువగా వేస్తా.. లవ్ యు అంటూ ట్వీట్ చేసాడు. 

Conversation between Bunny and Puri Jagannadh about Purimusings :

Allu Arjun praises Puri Jagan podcast 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs