Advertisement
Google Ads BL

మెగాస్టార్ తో మరో స్టార్..?


మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా సెట్స్ మీద ఉండగానే తర్వాతి సినిమా గురించి అనేక రకాల కథనాలు బయటకి వస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య తర్వాత మెగాస్టార్ మళయాలీ చిత్రమైన లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటిస్తాడని అనుకున్నారు. సాహో సినిమా దర్శకుడు సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడని ప్రచారం సాగింది. కానీ సడెన్ గా అన్నీ మారిపోయాయి.

Advertisement
CJ Advs

ప్రస్తుతం లూసిఫర్ చిత్రం పక్కకి తప్పుకుపోయి వెంకీమామా దర్శకుడు బాబీతో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉంటుందని వినబడుతుంది. ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్ర విషయమై అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మరో హీరో కూడా ఉంటారట.

అంటే బాబీ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం మల్టీస్టారర్ అన్నమాట. ప్రస్తుతం ఆ హీరోని వెతికే పనిలో ఉన్నారట. సాయి ధరమ్ తేజ్ ని అనుకున్నప్పటికీ కన్ఫర్మ్ కాలేదట. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి. మరి ఇవన్నీ నిజమో కాదో తెలియాలంటే ఆగస్టు 22వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే..

Mega multistarrer is on the cards..?:

Mega multistarrer is on the cards..?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs