Advertisement
Google Ads BL

నిహారిక పెళ్లిని నాగబాబు వాడేస్తున్నాడుగా..!


నాగబాబు తన కూతురు నిహారిక పెళ్లి ఈ ఏడాదే చెయ్యబోతున్నాడు. ఇప్పటికే నిహారిక, ఆమెకి కాబోయే భర్త జొన్నలగడ్డ చైతన్య ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మెగా డాటర్ నిహారిక పెళ్లి అంటే ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు మెగా ఫాన్స్. కరోనా లాక్ డౌన్ లోనే నిహారిక పెళ్లి చేస్తారు? నిహారిక పెళ్లి కి ఫాన్స్ ని ఇన్వైట్ చేస్తారా? అసలు చైతన్య ఎలా సెట్టయ్యాడు? చైతన్య కుటుంబానికి మీ కుటుంబానికి ఉన్న అనుబంధం ఏమిటి? నిహారిక పెళ్లి, నిశ్చితార్ధం ఎప్పుడు? అంటూ నాగబాబు ఎక్కడికి వెళితే అక్కడ మీడియా నుండి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దానితో చిరాకు పడిన నాగబాబు నా కూతురు పెళ్లి ప్రవేట్ ఫంక్షన్. ఇది పబ్లిక్ ఫంక్షన్ కాదు అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. మరి అంత ప్రవేట్ ఫంక్షన్ అంటూ కూతురు పెళ్ళికి మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పకనే చెప్పిన నాగబాబు ఇప్పుడు పబ్లిక్ గా కూతురు పెళ్లి వాడేస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఎలా అంటే వినాయకచవితికి ప్రతి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తుంది. అందులో ఈటివి, జీ తెలుగు, స్టార్ మా, జెమిని ఛానల్స్ లు ఇలాంటి పండగల స్పెషల్ ప్రోగ్రామ్స్ లో పోటీపడుతుంటాయి. అయితే తాజాగా ఓ ఛానల్ లో బాపు బొమ్మకు పెళ్లి అనే ప్రోగ్రాం డిజైన్ చేసింది. అందులో నిహారిక పెళ్లి కూతురు గెటప్ లో కనిపించడమే కాదు.. నిహారిక పెళ్లి మాటలే హైలెట్ అనేలా ఉంది. కొణిదెల వారి పెళ్లి సందడి అంటూ హైలెట్ చేసేలా నాగబాబు కూతురు నీహారిక ఫొటో వీడియోస్ తీసుకుంటూ నిహారిక పల్లకిలో పెళ్లి కూతురు మాదిరి సెట్స్ మీద అడుగుపెట్టడం, అలాగే ఓ సాంగ్ కి డాన్స్ చెయ్యడం, జడ్జ్ సీట్ లో నిహారిక పెళ్లి కూతురిగా ఆసీనులవ్వడం.. అబ్బో హంగామా మాములుగా లేదు. ఇక ఈ షోలో అనసూయ తన భర్త భరద్వాజ్ తో పాటుగా సందడి చేసింది. మరి పెళ్లి ప్రవేట్ ఫంక్షన్ అంటూ చెప్పిన నాగబాబు ఇప్పుడు నిహారిక పెళ్లిని ఇలా పబ్లిక్ చేస్తున్నాడేమిటా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. 

Nagababu Daughter Niharika in wed look for Festival Episode :

Nagababu Uses Niharika Marriage In Entertainment Channel 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs