బిగ్‌బాస్ సీజన్ 4 కోసం బుల్లితెర ప్రేక్షకులంతా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ సీజన్ వన్‌ను సూపర్‌హిట్ చేసి ఆ సీజన్ బ్లాక్ బస్టర్ చెయ్యగా.. నాని సీజన్ 2 ని సక్సెస్ ఫుల్‌గా నడిపించాడు. బిగ్ బాస్ సీజన్ 3ని నాగార్జున రక్తి కట్టించాడు. కాబట్టే సీజన్ 4కి మళ్లీ నాగార్జునని తీసుకున్నారు బిగ్ బాస్ యాజమాన్యం వారు. ఇక ఈ నెలాఖరున బిగ్ బాస్ సీజన్ 4 మొదలు కాబోతుంది... నాగార్జున ఇప్పటికే ప్రోమో షూట్ చేశాడు.. అది అందరితో పంచుకున్నాడు.. ఇంకేంటి ఈ నెలాఖరు నుండి బిగ్ బాస్ బుల్లితెర మీద వచ్చేస్తుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 కరోనా వలన భారీ మార్పులతో రంగంలోకి దిగుతుంది అని ప్రచారం జరిగింది.
అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. కారణం బిగ్ బాస్ సెట్ లో ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయని... కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేశాక.. 14 రోజులు హోమ్ క్వారంటైన్‌కి పంపాలి. అలా హోమ్ నుండి వచ్చాక మళ్లీ కరోనా టెస్ట్ లు చెయ్యాలి.. అందులో నెగటివ్ రావాలి. ఇవన్నీ చెయ్యడానికి కాస్త టైం పడుతుంది కాబట్టే..కొద్దీ రోజులు ఈ సీజన్ ని వాయిదా వేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ షో లో పాల్గొనబోయే కంట్రస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అవడము లీకవడము జరిగింది. అయితే ఓ 30 మందిని ఫైనల్ చేసి అందులో 15 మందిని హౌస్ లోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారట. అందుకే ఇప్పుడప్పుడే బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరు వెళ్తున్నారో చెప్పడం కూడా కష్టమే.
ఇక కరోనా వలన బిగ్ బాస్ హౌస్ లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయంటున్నారు. అందులో ముఖ్యంగా బెడ్స్ చేంజ్ అంట. గత సీజన్లలో కంటెస్టెంట్స్ బెడ్స్ అన్నీ పక్క పక్కనే ఉండేవి. అంతేకాకుండా ఒకే బెడ్‌పై ఇద్దరిద్దరు పడుకునేవారు. కానీ కరోనా ఎఫెక్ట్ ఈసారి భౌతికదూరం పాటిస్తూ ఎవరి బెడ్‌లు వారికి కేటాయించవచ్చు అనే టాక్ ఉంది. ఇక కంటెస్టెంట్స్ వంట, క్లీనింగ్, బయట నుంచి తీసుకుని వచ్చే వస్తువులు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారట.