Advertisement
Google Ads BL

మంచులక్ష్మీ రిలీజ్ చేసిన మెట్రో కథలు ట్రైలర్..


అల్లు అరవింద్ ఆహా యాప్ ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు. కొత్త కొత్త సినిమాలని ఆహాలోకి తీసుకురావడంతో పాటు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టారు. దాన్లో భాగంగా ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్ లు సెట్స్ మీద ఉండగా, మరికొన్ని సిరీస్ లు పనులన్నీ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. జర్నలిస్ట్ ఖదీర్ బాబు రచించిన చిన్న కథల్ని తీసుకుని సిరీస్ గా రూపొందించిన మెట్రో కథలు టైలర్ రిలీజైంది.

Advertisement
CJ Advs

మంచు లక్ష్మీ చేతుల మీదుగా రిలీజైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. టీజర్ లో లాగే ట్రైలర్ లోనూ ఎక్కువ మాటలు లేవు. ఒక సిటీలోని నాలుగు కథల్లో ఉండే బాధాకరమైన సంఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాలుగు కథల్లో కనిపించే పాత్రలన్నీ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లుగా ఉంది. రాజీవ్ కనకాల, సనా, ఆలీ రెజా, బిగ్ బాస్ బ్యూటీ నందినీ రాయ్, గాయత్రి భార్గవి ప్రధాన పాత్రలుగా వస్తున్న ఈ మెట్రో కథలు కన్నీటిని పరిచయం చేసేవిలా ఉన్నాయి. 

సాధారణంగా వెబ్ సిరీస్ అనగానే విపరీతమైన కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ సిరీస్ అందుకు భిన్నంగా అనిపిస్తుంది. ఆగస్టు 14వ తేదీ నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవనున్న ఈ మెట్రో కథలు ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.

click here for trailer

Manchu laxmi released Metro kathalu trailer..:

Manchu laxmi released Metro kathalu trailer..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs