చిరంజీవి ఖైదీ తర్వాత సైరా చెయ్యడానికి రెండేళ్లు టైం తీసుకుంటే ఆచార్యకి అనుకోకుండా ఏడాదిన్నర పట్టేసేలా ఉంది. కరోనా రాకపోతే ఆచార్య ఈసరికే చివరి దశలో ఉండేది. కానీ కరోనా కారణంగా ఏకంగా ఆరు నెలలు షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఇక ఆచార్య తర్వాత దర్శకుడు బాబీతో, అలాగే మెహెర్ రమేష్‌తో సినిమాలకు చిరు కమిట్ అయ్యాడనే న్యూస్ ఉంది. బాబీ చెప్పిన కథకి, అలాగే వేదాళం రీమేక్‌కి ఓకే చెప్పిన చిరు ఆచార్య తర్వాత ఓ మెగా ప్లాన్‌ని వర్కౌట్ చెయ్యాలని చూస్తున్నాడట. ఇప్పటివరకు ఒక సినిమా సెట్స్ మీదుంటే మరో సినిమాని పట్టాలెక్కించలేదు. అంటే చిరుకి మెగాస్టార్ స్టేటస్ వచ్చాక ఒకేసారి రెండు సినిమాలు చెయ్యలేదు.
అయితే తాజాగా ఆచార్య సినిమా విడుదలయ్యాక దర్శకుడు బాబీ, మెహెర్ రమేష్ వేదాళం రీమేక్ ని ఒకేసారి పట్టాలెక్కించి ఒకేసారి పూర్తి చెయ్యాలని చిరు మెగా ప్లాన్ గా చెబుతున్నారు. ఈ రెండు సినిమాలను పూర్తి చేసాక మరో సినిమాని వినాయక్ దర్శకత్వంలో చిరు చేయబోతున్నాడట. ముందు వేదాళం రీమేక్‌ని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట చిరు. ముందు బాబీ చెప్పిన కథకి కనెక్ట్ అయినా.. వేదాళం రీమేక్ తెలుగు స్క్రిప్ట్ తో మెహెర్ రమేష్ రెడీగా ఉన్నాడట. కాబట్టి ముందు రమేష్ తో మూవీ మొదలు పెట్టి వెంటనే బాబీతోను సినిమా మొదలుపెడతాడట. బాబీ కథ స్క్రిప్ట్ లోకి మారడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టే మెహెర్ ముందు మొదలెడుతున్నాడట. మరి చిరు ఒకేసారి రెండు సినిమాలు చెయ్యడానికి అయన వయసు సహకరించాలిగా.. చూద్దాం చిరు మెగా ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనేది.