ఎన్టీఆర్ RRR మూవీతో పాటుగా త్రివిక్రమ్ సినిమా కూడా కమిట్ అయ్యాడు. కానీ కరోనా లాక్ డౌన్ వలన సినిమా షూటింగ్స్ బంద్ నడుస్తున్నాయి. అయితే RRR తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీలో నటించాల్సి ఉంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ ఇద్దరు భామలతో రొమాన్స్ చేస్తాడని అందులో ఒకరు పూజా అయినా, లేదా రష్మిక అయినా, లేదా జాన్వీ కపూర్ అయినా లేదంటే కియారా అద్వానీ అయినా అవ్వొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఎవరనేది త్రివిక్రమ్ ఇంకా ఫైనల్ చెయ్యలేదు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కబోయే పాన్ ఇండియా సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే భామపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబోపై అధికారిక ప్రకటన రాలేదు కానీ.. తెర వెనుక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా కథపై కూర్చున్నాడని... ఇప్పటికే ఎన్టీఆర్ కి ఫోన్ లో కథ వినిపించాడని టాక్ స్ప్రెడ్ అయ్యింది. మైత్రి మూవీస్ వారు ఎన్టీఆర్ తో తియ్యబోయే సినిమా కోసం ప్రశాంత్ నీల్ కి భారీ బడ్జెట్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతుంది. అందుకే ఇందులో నటించబోయే హీరోయిన్ విషయమై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ప్రశాంత్ నీల్ తీసిన కెజిఎఫ్ లో హీరోయిన్ ని పెట్టాలని పెట్టాడు కానీ.. హీరోయిన్ కి ఆ సినిమాలో అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. కానీ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ కి హీరోయిన్ అంతగా ఇంపార్టెన్స్ లేకపోతే ఆయన ఫ్యాన్స్ ఊరుకోరు. ఎన్టీఆర్ కి నాలుగు డ్యూయెట్స్ ఉండాలి. మంచి డాన్స్ లు. లేకపోతే కష్టం. మరి ఎన్టీఆర్ కోసం హీరోయిన్ పాత్ర ఎలా రాస్తాడో.. దాని కోసం ప్రశాంత్ నీల్ ఎలాంటి హీరోయిన్ ని వెతికి పట్టుకొస్తారో చూడాలి.