Advertisement
Google Ads BL

ఆ రోజున అభిమానులకి రెండు పండగలు..?


మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై చాలా రోజులుగా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా కథపై అనేక కథనాలు బయటకి వచ్చాయి. అయితే మరో కొద్ది రోజుల్లో ఆచార్య నుండి  అప్డేట్ రానుందని సమాచారం అందుతుంది.

Advertisement
CJ Advs

ఈ నెల 22వ తేదీన మెగాస్టార్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆచార్య మూవీ అప్డేట్ బయటకి వస్తుందట. ఇప్పటికే కొద్దిభాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం నుండి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసే పనిలో ఉన్నారట. అయితే ఆచార్య చిత్ర అప్డేట్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి తర్వాతి చిత్ర ప్రకటన వెలువడనుందట. అయితే అది లూసిఫర్ తెలుగు రీమేక్ కాదని సమాచారం అందుతోంది.

తమిళంలో సూపర్ హిట్ అందుకున్న వేదాళం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారట. మెహెర్ రమేష్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయట. మొత్తానికి మెగా అభిమానులకి డబుల్ ఫీస్ట్ ఖాయం అని వినబడుతుంది. చూడాలి మరేం జరుగుతుందో..

Double feast for Megastar Fans..?:

Double feast for Megastar Fans..?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs