Advertisement
Google Ads BL

‘బీబీ3’లో ఈ యంగ్ హీరో పాత్ర ఏమిటంటే..?


బోయపాటి డైరెక్ట్ చేసే సినిమాల్లో హీరో కుండే ఇంపార్టెన్స్ విలన్‌కి ఉంటుంది. విలన్ పాత్రలను చాలా బలంగా చూపిస్తాడు బోయపాటి. హీరోగా అవకాశాలు లేని జగపతిబాబుని లెజెండ్‌లో పవర్ ఫుల్ విలన్‌గా చూపించాడు. అలాగే ఆది పినిశెట్టిని సరైనోడు సినిమాలో సూపర్ విలన్‌గా చూపించాడు. ఇక తాజాగా హీరో నవీన్ చంద్రని కూడా ఓ పవర్ ఫుల్ యంగ్ ఎమ్యెల్యేగా బాలయ్య సినిమాలో చూపించబోతున్నాడట. నవీన్ చంద్ర ఇప్పటికే విలన్ పాత్రకు బాగా సెట్ అవుతున్నాడు. తెలుగులో ‘అరవింద సమేత’, తమిళనాట ధనుష్ ‘లోకల్ బాయ్’లోను విలన్‌గా అదరగొట్టేశాడు.

Advertisement
CJ Advs

కానీ బోయపాటి సినిమాల్లోని విలన్‌గా ఇప్పటివరకు పవర్ ఫుల్ పాత్ర పడలేదు నవీన్ చంద్రకి. కానీ తాజాగా బాలయ్య - బోయపాటి కొత్త సినిమాలో నవీన్ చంద్రని పవర్ ఫుల్ యంగ్ ఎమ్యెల్యేగా చూపించబోతున్నాడట. మరి యంగ్ విలన్ ఎమ్యెల్యే బాలయ్యని భయపెడతాడో.. లేదంటే బాలయ్యే ఆ ఎమ్యెల్యేని పరిగెత్తిస్తాడో తెలియదు కానీ... ప్రస్తుతం బాలయ్య - బోయపాటి సినిమాపై భీభత్సమైన అంచనాలున్నాయి. కారణం ఇంతవరకు వారి కాంబోలో అన్ని బ్లాక్ బస్టర్స్ ఉండడం ఒకటైతే.. మరొకటి.. #BB3 టీజర్ అదరగొట్టడమే. మరి కరోనా తగ్గేవరకూ బాలయ్య - బోయపాటి సినిమా సెట్స్ మీదకెళ్లేలా కనిపించడం లేదు. 

Young Hero Naveen Chandra in BB3 Movie:

Young Hero Naveen Chandra Plays Villain role in Balayya and Boyapati Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs