Advertisement
Google Ads BL

చిట్టిబాబుగా లారెన్స్.. సెట్టవుతాడా?


సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ - సమంత జంటగా తెరకెక్కిన రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కాదు... నాన్ బాహుబలి రికార్డులు కొల్లగొట్టిన సినిమా. రామ్ చరణ్ చిట్టిబాబుగా రంగస్థలంలో చెవిటివానిగా అదరగొట్టేసాడు. ఆ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ మరింతగా పెరిగింది. అయితే ఈ సినిమాని తమిళనాట రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగులో తెరకెక్కిన రంగస్థలం సినిమా తమిళ నేటివిటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ రీమేక్ చేస్తే సినిమా హిట్ కంపల్సరీ అంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే తమిళనాట తెరకెక్కే రంగస్థలం రీమేక్‌లో హీరోగా ఎవరు నటిస్తారనే దానిమీద అందరిలో క్యూరియాసిటీ ఉంది. అయితే రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో మల్టీ టాలెంటెడ్ హీరో లారెన్స్ నటించే అవకాశం ఉన్నట్లుగా టాక్. ఇప్పటికే రంగస్థలం చిట్టిబాబు పాత్రకి లారెన్స్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా టాక్. మరోపక్క మెగా ఫాన్స్ చిట్టిబాబు‌గా రామ్ చరణ్ ఊర మాస్ లుక్ లో అదరగొట్టాడు. అలాంటి మేకోవర్ లారెన్స్‌కి సాధ్యం కాదు... లారెన్స్ మల్టీ టాలెంటెడ్ అది ఎవరూ కాదనరు. కానీ చిట్టిబాబు పాత్రలో లారెన్స్ సెట్ కాడు.. వేరేవరన్నా అయితే ఆ పాత్రకి న్యాయం చేస్తారు అంటూ మొత్తుకుంటున్నారు. మరి నిజంగానే లారెన్స్ చిట్టి బాబుగా మెప్పిస్తాడు కానీ... లుక్స్ పరంగా తేలిపోయే ఛాన్స్ ఉంది.

Lawrence in Ram Charan Rangasthalam Tamil Remake:

Rangasthalam Tamil Remake Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs