Advertisement
Google Ads BL

ఇక రియా సినీ కెరీర్ ముగిసినట్లే..!


తెలుగులో తూనీగ తూనీగ అంటూ ఎంఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్‌తో కలిసి ఎగిరింది. కానీ ఆ సినిమా హిట్ కాకపోవడంతో.. బాలీవుడ్‌కి చెక్కేసింది రియా చక్రవర్తి. ఎప్పుడూ పెద్దగా న్యూస్‌లో ఉండని రియా చక్రవర్తి... సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్‌గా అందరికీ పరిచయమై.. బికినీ షోస్‌తో అందరి కళ్ళు ఆమెపై పడేలా చేసుకుని. సుశాంత్‌తో జిమ్‌లకి, ప్రైవేట్ పార్టీలకు, అలాగే రెస్టారెంట్స్ కి వెకేషన్స్ కి తిరిగిన రియా చక్రవర్తికి బాలీవుడ్‌లోను ఓ అన్నంత క్రేజ్ లేదు.. ఫేమూ లేదు. అయినా అవకాశాల కోసం మహేష్ భట్ లాంటి వాళ్లతో చనువుగా ఉంటూ సుశాంత్ సింగ్ రాజపుత్ మరణానికి పరోక్షంగా కారణమైంది.

Advertisement
CJ Advs

సుశాంత్ సింగ్ చనిపోయినప్పుడు రియాని జస్ట్ అనుమానిస్తే.. తాజా పరిణామాలు రియా చక్రవర్తే సుశాంత్ సింగ్ మరణానికి గట్టి కారణమనేలా ఉన్నాయి. సుశాంత్ సింగ్ మరణానికి రియా చక్రవర్తే కారణమంటూ బీహార్ పోలీస్‌లు చెబుతుంటే.. ముంబై పోలీస్‌లు మాత్రం రియాని కాపాడేందుకు చూస్తున్నారంటూ బీహార్ పోలీస్‌లే సుప్రీం కోర్టుకి చెబుతున్నారు. అలాగే సిబిఐ రియా ఫ్యామిలీపై రియా పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. 

తాజాగా ఈడీ ఆఫీస్‌కి రియా చక్రవర్తి విచారణకు హాజరైంది. మరి సుశాంత్ సింగ్ మరణానికి రియా కారణమో కాదో కానీ.. ప్రస్తుతం మాత్రం రియా కెరీర్ ముగిసినట్టే అంటున్నారు. తెలుగులో చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి టీం కి హ్యాండ్ ఇచ్చి సుశాంత్ సినిమా కోసం వెళ్లిన రియా నేడు సుశాంత్ సింగ్ కేసులో కోర్టు మెట్లెక్కుతుంది. మరి ఆమెకి అవకాశాలు ఇవ్వాలన్నా దర్శకనిర్మాతలు ఆమెపై వచ్చిన అభియోగాలకు భయపడతారు కానీ.. అవకాశాలు మాత్రం ఇవ్వరు. సో.. ఇక ఆమె సినీ కెరీర్ ముగిసినట్లే.  

CBI files FIR against Rhea Chakraborty:

Rhea Chakraborthy Cine Career collapsed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs