Advertisement
Google Ads BL

బన్నీ వదిలేసిన స్క్రిప్ట్.. చరణ్ చేస్తాడా?


అల్లు అర్జున్ అల వైకుంఠపురములో జోరులో వరసగా సినిమాలు ప్రకటిస్తున్నాడు. పుష్ప, ఐకాన్, కొరటాల మూవీని అల్లు అర్జున్ లైన్‌లో పెట్టాడు. సుకుమార్‌తో పుష్ప పాన్ ఇండియా మూవీ చేస్తున్న అల్లు అర్జున్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చేయబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్రకటించాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్‌కి ఐకాన్ సినిమా చేయాలని లేనట్లుగా కనబడుతుంది వ్యవహారం. ఐకాన్ పాన్ ఇండియా స్క్రిప్ట్ కాదనుకున్నాడో... లేక మరెందుకో తెలియదు కానీ.. అల్లు అర్జున్ కొరటాలతో మరో మూవీకి ఓకే చెప్పి ఐకాన్‌ని హోల్డ్‌లో పెట్టేశాడు. ఐకాన్‌తో అల్లు అర్జున్‌ని తన బ్యానర్‌లో నటింపజేయాలనుకున్న దిల్ రాజుకి అల్లు అర్జున్ అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నాడు.

Advertisement
CJ Advs

కానీ దిల్ రాజుకి మాత్రం వేణు శ్రీరామ్ చెప్పిన ఐకాన్ స్క్రిప్ట్ మీద బాగా గురి ఉంది. అందుకే అల్లు అర్జున్ కరుణిస్తాడేమో అని ఎదురు చూసి చూసి తాజాగా రామ్ చరణ్‌ని ఒప్పించే పని పెట్టుకున్నాడట. అల్లు అర్జున్ హోల్డ్‌లో పెట్టిన స్క్రిప్ట్‌తో రామ్ చరణ్‌ని ఒప్పించే ప్రయత్నాలు దిల్ రాజు మొదలు పెట్టాడట. RRR తర్వాత ఇప్పటివరకు రామ్ చరణ్ మరో మూవీ ప్రకటించలేదు. దాన్ని అదునుగా చేసుకున్న దిల్ రాజు రామ్ చరణ్ వెంటపడుతున్నాడట. మరి అల్లు అర్జున్ వదిలేసిన స్క్రిప్టు తో రామ్ చరణ్ సినిమా చేస్తాడా లేదా అనేది ప్రస్తుతానికున్న అతిపెద్ద సస్పెన్స్.

Dil Raju waiting for Charan Response on Bunny Icon:

Ram Charan in Allu Arjun Icon Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs