Advertisement
Google Ads BL

కాజల్.. కుమ్మేస్తుందంతే..!!


కాజల్ అగర్వాల్ కెరీర్ ముగిసిపోతుంది అనుకునేలోపు.. కాజల్ అగర్వాల్ మళ్లీ అవకాశాలతో ఎగిసి పడుతుంది. దర్శకుడు తేజ, కాజల్‌కి లైఫ్ ఇచ్చినట్టుగానే.. మళ్లీ పడిపోతున్న తన కెరీర్‌కి ‘నేనే రాజు నేనే మంత్రి’తో మళ్ళీ లైఫ్ ఇచ్చాడు. తర్వాత సీత, కవచం, రణరంగం, తాజాగా చిరు ఆచార్య సినిమాలతో కాజల్ అగర్వాల్ కెరీర్ మళ్ళీ పుంజుకుంది. ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా కాజల్ అగర్వాల్ స్థానం ప్రత్యేకం అన్నట్టుగా ఉంది. అందుకే ఐటెం సాంగ్‌లకు కాజల్ అగర్వాల్‌ని అప్రోచ్ అవుతున్నారు. అటు సీనియర్స్‌కి ఇటు కుర్ర హీరోలకి కాజల్ అగర్వాల్ ఇంకా గ్లామర్ గర్ల్‌గానే కనబడుతుంది.

Advertisement
CJ Advs

ఇక వచ్చిన అవకాశాలతో పారితోషకం విషయంలోనూ కాజల్ ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా జస్ట్ గెస్ట్ రోల్‌కే 70 లక్షల పారితోషకం కాజల్ అందుకోబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రానా హీరోగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న హాథీ మేరీ సాథీ చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ చేసింది. ఆ గెస్ట్ రోల్ కూడా ఓ 30 నిమిషాల పాటు ఉంటుంది. ఆ అరగంట సేపటికే కాజల్ అగర్వాల్ రూ. 70 లక్షలు తీసుకోనున్నట్టు సమాచారం. ఇందులో ఆమె ఆదివాసీ యువతి పాత్ర చేస్తుందని... అందుకు తగ్గట్టుగానే కట్టు బొట్టు కూడా ఉంటాయట. మరి ఆదివాసీ యువతిగా కాజల్ అగర్వాల్ జస్ట్ గెస్ట్ రోల్‌కి భారీగా అందుకోబోతుందన్నమాట.

Kajal Agarwal Remuneration for A Guest Role :

Kajal Agarwal Takes Rs 70 lakh to guest role in Rana Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs