Advertisement
Google Ads BL

సెట్స్ వేసినా.. ‘రాధేశ్యామ్’ ప్రాబ్లమ్ ఇదే..!


ప్రస్తుతం కరోనా పరిస్థితి వలన సినిమా షూటింగ్స్ వాయిదా పడడమే కాదు... ఇతర దేశాల్లో ప్లాన్ చేసిన షూటింగ్ షెడ్యూల్స్ ని అన్ని... సినిమాల యూనిట్స్ క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి. ప్రస్తుతం అంతర్జాతీయ అనుమతులు దొరకవు కాబట్టి ఇక్కడే హైదరాబాద్ లోనే సెట్స్ వేసుకుని లాగించేసే ప్లాన్ లో చాలామంది దర్శకనిర్మాతలు ఉన్నారు. అందులో ప్రభాస్ - రాధాకృష్ణ రాధేశ్యామ్ మూవీ కూడా ఉంది. అసలు రాధేశ్యామ్ మూవీ మొత్తం యూరప్ తదితర ప్రాంతాల్లో షూట్ చెయ్యాల్సిన కథ. కరోనా ముందు వరకు ప్రభాస్ అండ్ టీం జార్జియాలోనే ఉంది. లాక్ డౌన్ పెట్టగానే ప్రభాస్ వాళ్ళు ఇండియాకి వచ్చేశారు. 

Advertisement
CJ Advs

అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ కోసం రామోజీ ఫిలిం సిటీలోనే యూరప్ సెట్ వేసి షూట్ చేయాలని అనుకుంటున్నారు. మరోపక్క అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ సెట్ వేశారు. కాగా, ఈ సినిమా కోసం ఎన్ని సెట్స్ వేసినా.. యూర‌ప్ లోనే షూట్ చెయ్యాల్సిన కొన్ని సీన్లు బాకీ ప‌డుతున్న‌ట్టుగా ఫిలింనగర్ టాక్‌. అందుకోస‌మైనా మూవీ యూనిట్ మొత్తం ఓ చిన్న షెడ్యూల్ వేసుకుని... యూర‌ప్ వెళ్లి రావాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ట‌. యూరప్‌‌లో కనీసం వారం – ప‌ది రోజుల పాటు చిన్న షెడ్యూల్ ప్లాన్ చేసి.. టైం వేస్ట్ కాకుండా సినిమాకి సంబంధించిన ఆ కీలక సన్నివేశాలను షూట్ చెయ్యాలని అనుకుంటున్నారట. 

మరి ఈలోపు అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌కు అనుమ‌తులు ద‌క్కాలి. ఇదంతా జ‌ర‌గ‌డానికి కాస్త టైమ్ ఉంది. దానికి చాలా సమయం పట్టేలా ఉంది. కాబట్టి ఈలోపు ఇక్కడ సెట్స్ లో చెయ్యాల్సిన షూటింగ్ కంప్లీట్ చేసి యూరప్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తారట. సో ప్రభాస్ ఎంత చేసి హైదరాబాద్‌లోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేద్దామన్నా యూరప్ ట్రిప్ తప్పేలా లేదు. 

New Problems to Radhe Shyam Movie shooting:

Radhe Shyam to be shot in Europe
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs