Advertisement
Google Ads BL

నాకెవ్వరూ పోటీ రారు.. లేరంటున్న హీరోయిన్!


ఈమాటన్నది ఎవరో కాదు.... మిల్కి బ్యూటీ తమన్నా. ప్రస్తుతం సీనియర్స్ లిస్ట్‌లో చేరిన తమన్నా ఇప్పటికి సినిమాలతో బిజీగానే ఉంది. అటు ఐటెం సాంగ్స్ తోనూ పిచ్చెక్కిస్తున్న తమన్నా తనకి పోటీ అని ఎవ్వరిని భావించదట, మరి హీరోయిన్‌కి కాస్త ఫేమ్ వస్తే.. మరొకరు తమకి ఎక్కడ పోటీ వస్తారో అని తెగ ఫీలవుతుంటారు. ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాలోని హీరోయిన్‌కి మరిన్ని అవకాశాలొస్తాయో.. మా అవకాశాలు తన్నుకుపోతుందో అంటూ తెగ బెంగ పెట్టేసుకుంటారు. కానీ తమన్నాకి అలాంటిదేం లేదట. తనకి ఎవరూ పోటీ అని కానీ.. తాను ఎవరికీ పోటీ అని కానీ ఫీలవదట. ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత అనేది ఎప్పుడూ ఉండదు. నదిలోకి కొత్త నీరొచ్చినట్టుగా ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్స్ వస్తుంటారు. అందులో ప్రతిభావంతులు ఉంటారు. ఇక ఇక్కడ ఎవరితో వారికే పోటీ. నావరకు నేనే మరొకరు నాకు పోటీ అనే ఆలోచన రానివ్వను.

Advertisement
CJ Advs

నా సినిమాలను వేరొకరు ఎగరేసుకుపోతారేమో అనే బెంగ నాకెప్పుడూ ఉండదు. అంతేకాదు.. మరొక హీరోయిన్ కి హిట్ పడింది కదా అని నాకు అసూయ కూడా రాదు. ఎందుకంటే మేము శత్రువులం కాదు.. చాలామంచి స్నేహితులం. టాలీవుడ్ లో నాకు కాజల్, సమంత, అనుష్క లాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మేము ఒకరి విజయాలను మరొకరు ఆస్వాదిస్తాం. అయినా ఓ శుక్రవారం నాలుగు సినిమాలు విడుదలైనా అన్ని సినిమాలు ఆడాలని విజయం సాధించాలని లేదు. అలాగే అన్ని సినిమాలు పోవాలని, ప్లాప్ అవ్వాలని లేదు ఆ నాలుగు సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు. అందుకే మా హీరోయిన్స్ మధ్యన పోటీ అనే పదానికి చోటు ఉండదు అని చెబుతుంది తమన్నా.

No competition to me says Heroine Tamanna :

Tamanna sensational comments on competition
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs