బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంత మారిపోయింది. అప్పటి వరకూ దక్షిణాది వారికే సుపరిచితమైన ప్రభాస్, బాహుబలి తో ప్రభాస్ ఉత్తరాది వారికి దగ్గరయ్యాడు. సాహో సినిమా దక్షిణాదిన అంతగా ఆకట్టుకోకపోయినా బాలీవుడ్ లో విజయం సాధించిందంటే అక్కడ ప్రభాస్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నిజమైన నేషనల్ స్టార్ అంటే ప్రభాస్ ఒక్కడే అని చెప్పాలి. ఇటీవల విడుదలైన ప్రభాస్ రాధేశ్యామ్ చిత్ర ఫస్ట్ లుక్ కి వచ్చిన స్పందన ఈ విషయాన్ని మరోమారు తెలియజేసింది.
అయితే దేశవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ సంపాదించుకున్న సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. సాధారణంగా ప్రభాస్ ఎక్కువగా మాట్లాడడు. ఆ కారణంగానే సోషల్ మీడియాలో పెద్దగా ఆక్టివ్ గా ఉండడు. అయితేనేమి రికార్డులు మాత్రం సృష్టిస్తూనే ఉన్నాడు. గత ఏడాది ఏప్రిల్ లో సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఏడాదిన్నర కాలంలోనే 50లక్షల ఫాలోవర్స్ ని ఏర్పర్చుకున్నాడు. అతి తక్కువ కాలంలో ఆ రేంజ్ లో ఫాలోవర్స్ దక్కించుకుని రికార్డు క్రియేట్ చేసాడు.
ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రంతో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నాడు. సైంటిఫిక్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది.