ఈ ఏడాది లక్కీ హీరోయిన్ ఎవరయ్యా అంటే రష్మిక మందన్నానే. ఎందుకంటే మహేష్ తో సూపర్ హిట్, నితిన్ భీష్మతో సూపర్ హిట్ కొట్టడమే కాదు.. ఏకంగా అల్లు అర్జున్ తో పుష్ప పాన్ ఇండియా మూవీ చెయ్యడమే రష్మిక లక్కీ అనడానికి అతి పెద్ద కారణం. వరసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్న రష్మిక ఓ అన్నంత అందమైన అమ్మాయి కాదు. అలాగే గ్లామర్ గర్ల్ అంతకన్నా కాదు. అందులోనూ కాస్త పొట్టి కూడా.. అయినప్పటికీ.... ఇతర హీరోయిన్స్ కి దక్కని అవకాశాలు రష్మికకి దక్కుతున్నాయంటే రష్మికది 100 శాతం అదృష్టమని చెప్పాలి. తాజాగా రష్మికా మందన్నా.. అందంపై బోలెడన్ని టిప్స్ సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తుంది.
రష్మికా అందంగా తెల్లగా ఉండడానికి కారణాలు కూడా చెబుతుంది. గతంలో రష్మిక చర్మం అంతగా అందంగా ఉండేది కాదట. దానితో రష్మిక డాక్టర్స్‌తో టెస్ట్ చేయించగా స్కిన్ ఎలెర్జీ ఉందని తేలిందట. దానితో రష్మిక స్కిన్ ఎలెర్జికి ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటుగా.. మంచి డైట్ కూడా తీసుకునేదట. స్కిన్ ఎలర్జీకి కారణమైన అన్నిరకాల ఆహారాలను రష్మిక దూరం పెట్టిందట. అలాగే స్కిన్ గ్లో అయ్యే ఆహారపదార్ధాలను, ఫ్రూట్స్ ని తీసుకోవడం మొదలు పెట్టాక తన చర్మం నిగనిగలాడుతోంది అని చర్మ సౌందర్యం గురించి అందం గురించి రష్మికా ఇలాంటి బ్యూటీ టిప్స్ ఇస్తుంది.