Advertisement
Google Ads BL

పాపం పూజాని ఆడిపోసుకుంటున్నారుగా..!


ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరో అందరికి తెలుసు. పూజా హెగ్డే అనగానే టాప్ హీరోయిన్ అనేస్తారు. స్టార్ హీరోల దగ్గరనుండి కుర్ర హీరోల వరకు పూజా హెగ్డేనే బెస్ట్ ఆప్షన్‌లా మారింది. సమంత, తమన్నా, కాజల్ లాంటి హీరోయిన్స్ అందరూ సీనియర్స్ లిస్ట్‌లోకి వచ్చేసారు. దానితో హీరోయిన్స్ కొరత. కాబట్టే నటనలో కాస్త వీక్ అయినా... గ్లామర్ షో తోనే స్టార్ హీరోలతో అవకాశాలు పట్టేస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోలంతా పూజా వెంటే పడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీతో పాటుగా అఖిల్ అక్కినేనితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో నటిస్తున్న పూజాహెగ్డేకి పాత్ర నచ్చితే కుర్ర హీరో అని, చిన్న సినిమా అని చూడదనే విషయం గద్దలకొండ గణేష్ లోనే చూసాం. పాత్ర నచ్చితే ఒప్పుకునే పూజాహెగ్డే ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోకి నో చెప్పింది అనే టాక్ నడుస్తుంది.

Advertisement
CJ Advs

అది కూడా భీష్మ హిట్ తో ఉన్న నితిన్‌కి పూజాహెగ్డే నో చెప్పింది అని.. అయితే హీరో నచ్చక కాదు... పారితోషకం నచ్చకే పూజాహెగ్డే ఇప్పుడు నితిన్ సినిమాని రిజెక్ట్ చేసిందిగా అనే టాక్ నడుస్తుంది. ఇంతకీ నితిన్ కి నో చెప్పిన సినిమా ఏది అంటే... బాలీవుడ్ అంధాధూన్ సినిమాని తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్నాడు. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానాకి హెల్ప్ చేసే పాత్రలో రాధికా ఆప్టే నటించింది. తెలుగులో ఆ పాత్ర కోసం పూజాహెగ్డేని సంప్రదించినట్టుగా.. దానికి పూజా అధిక పారితోషకం అడిగితే ఇవ్వలేదని.... పూజ నితిన్ కి నో చెప్పిందిగా అంటున్నారు.

కానీ పూజాహెగ్డే పారితోషకం నచ్చక కాదు.. ఈ సినిమాని వదులుకుంది. పాత్ర నచ్చక అనే మరో టాక్ కూడా ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అంధాధూన్ సినిమాలో రాధికా ఆప్టే కేవలం గ్లామర్ షోకి తప్ప మరెందుకు పనికి రాలేదు. అయితే సినిమా మొత్తం బోల్డ్ క్యారక్టర్ చేసిన టబు - హీరో ఆయుష్మాన్ చుట్టూనే తిరుగుతుంది కానీ... రాధికా ఆప్టేది కేవలం గ్లామర్ షో కే పనికి వచ్చింది. అలాంటి క్యారక్టర్ లో చేస్తే కేవలం గ్లామర్ షో తప్ప పేరు రాదని పూజాహెగ్డే నితిన్ సినిమాకి నో చెప్పిందట. అదండీ విషయం. పాపం పూజాని ఆడిపోసుకుంటున్నారు.

Pooja Hegde rejected Nithiin Andhadhun Remake :

Reason Behind Pooja Hegde Nithiin Film Rejected
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs