Advertisement
Google Ads BL

దిగ్గజ గాయకుడికి కరోనా పాజిటివ్..


కరోనా వైరస్ రోజు రోజుకీ తన పంజా విస్తరించుకుంటూ వెళ్తుంది. ఇండియాలో ఇప్పటికే 19లక్ష్లలకి పైగా కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. వారు వీరు అనే తేడా లేకుండా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తూ దాని ఉధృతి మరింత పెంచుకుంటూ పోతుంది. సామాన్య జనాలతో పాటు చాలా మంది సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి కరోనా సోకింది.

Advertisement
CJ Advs

ఈ విషయాన్ని స్వయంగా బాలసుబ్రమణ్యం వీడియో ద్వారా వెల్లడి చేసారు. చిన్న జ్వరం, జలుబు లాంటి లక్షణాలు కనిపించగానే ఎందుకైన మంచిదని టెస్ట్ కి వెళ్ళాడట. దాంతో కరోనా పాజిటివ్ అని తేలిందట. వెంటనే వైద్యుల ప్రిస్కిప్షన్ మేరకు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళానని చెప్పుకొచ్చాడు. అయితే కుటుంబ సభ్యులకి దూరంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో చెన్నైలోని ఎమ్ జీ ఎమ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడట. ప్రస్తుతానికి తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

click here for video

Legendary Singer Tested corona positive..:

Legendary Singer Tested corona positive..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs