Advertisement
Google Ads BL

మేనకోడలితో చరణ్ డాన్స్ వీడియో వైరల్!!


కరోనా లాక్‌డౌన్‌తో ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్‌తో స్పెండ్ చేస్తున్న హీరోలు సోషల్ మీడియాలో కనబడితే చాలు ఫ్యాన్స్ కి పండగే. చిరు అయినా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాడు కానీ... రామ్ చరణ్ మాత్రం చాలా తక్కువగా ఫ్యాన్స్‌కి కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ అయితే అస్సలు కనిపించడం లేదు. మహేష్ మాత్రం తన పిల్లలతో చేసే అల్లరిని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటున్నాడు. ఇక ప్రభాస్ కూడా ఫస్ట్ లుక్ తోనే కానీ.. విడిగా కనిపించడు. కానీ అల్లు అర్జున్ మాత్రం వేకువ ఝామునే వాకింగ్ అంటూ జనారణ్యంలోకి వస్తున్నాడు. రామ్ చరణ్ మొన్నామధ్యన జానీ మాస్టర్ పుట్టిన రోజు విషెస్ అంటూ ఓ వీడియో విడుదల చేసాడు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా రామ్ చరణ్ లుక్ మరోసారి సోషల్ మీడియాలో రివీల్ అయ్యింది. అల్లూరి లుక్ నుండి రంగస్థలం చిట్టిబాబు లుక్ లో కనబడుతున్న రామ్ చరణ్ ఇంకా ఆ గెడ్డం, లాంగ్ హెయిర్ తోనే కనబడుతున్నాడు. తన ఇంట్లోనే మేనకోడలు నివిష్కాతో డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేసాడు రామ్ చరణ్. చిరు చిన్న కూతురు శ్రీజ - కళ్యాణ్ దేవ్ ల చిన్న కూతురు నివిష్కాతో రామ్ చరణ్ చేస్తున్న డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

నివిష్కా బుల్లి బుల్లి అడుగులు వేస్తూ టివిలో వచ్చే డాన్స్ మూమెంట్స్ కి చిట్టి చిట్టి చేతులతో డాన్స్ చేస్తూ మామ రామ్ చరణ్ తో కూడా స్టెప్స్ వేయించింది. మరి నివిష్కాతో డాన్స్ వీడియోని షేర్ చేసిన రామ్ చరణ్ డార్లింగ్ తో డాన్స్ అంటూ వీడియో షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

Click Here for Video

Ram Charan Dance Off With Navishka:

Ram Charan And His Niece Navishka Dance Video
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs